
క్వారీ గుంతలో పడి యువ రైతు మృతి
మంచిర్యాలక్రైం: క్వారీలో గుంతలో ప్రమాదవశాత్తు పడి యువరైతు మృతిచెందినట్లు ఎస్సై మజారోద్దిన్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. హాజీపూర్ మండలం నాగారం గ్రామానికి చెందిన కొడప గంగు–భారతి దంపతుల కుమారుడు యాదవరావు(25). తల్లిదండ్రులు వ్యవసాయం చేసుకుని జీవిస్తున్నారు. వారికి ఉన్న నాగారం శివారులోని పత్తి చేనులో నీరు పట్టేందుకు శనివారం సాయంత్రం యాదవరావు అక్కడికి వెళ్లాడు. కరెంట్ మోటారుకు మరమ్మతు చేపడుతున్నాడు. ఈక్రమంలో మోటారు పంప్‌ను నీటిలో బిగించేందుకు క్వారీలో దిగాడు. ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. గాలింపు చర్యలు చేపట్టగా ఆదివారం మృతదేహం లభ్యమైంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.