
అక్రమ కేసులు సరికాదు
కాగజ్‌నగర్‌టౌన్: సాక్షి మీడియాపై ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం అక్రమంగా కేసులు బనాయిస్తోందని జిల్లాలోని వివిధ సంఘాల నాయకులు పేర్కొన్నారు. నిజాలను నిర్భయంగా రాసే పత్రికలపై కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. సాక్షి దినపత్రిక ఎడిటర్ ధనంజయ్‌రెడ్డి, ఇతర జర్నలిస్టులపై అక్రమంగా కేసులు పెట్టడం సరికాదని హితవు పలికారు.
బెదిరింపులు మానుకోవాలి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జర్నలిస్టులను బెదిరించే ధోరణి మానుకోవాలి. సమాజంలో జరిగే వాస్తవాలు బయటపెడుతున్న పత్రికలపై కక్ష సాధించడం తగదు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి చర్యలు సరికాదు. ఇకనైనా ప్రభుత్వం దాడులను ఆపాలి.
– వైద్య శాంతికుమారి, టీఎస్‌యూటీఎఫ్ జిల్లా అధ్యక్షురాలు
తీవ్రంగా ఖండిస్తున్నాం
నిజాలను నిర్భయంగా నిగుతేల్చే వార్తలు రాసే జర్నలిస్టులపై అక్రమంగా కేసులు బనాయించడం సరికాదు. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తుంది. తప్పులను ఎత్తిచూపే హక్కు పత్రికలకు ఉంది. సాక్షి జర్నలిస్టులపై పోలీసులతో దాడులు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.
– సోయం చిన్నన్న,
తుడుం దెబ్బ రాష్ట్ర ఉపాధ్యక్షుడు
కేసులు ఎత్తివేయాలి
ప్రజల వాణిని వినిపించే మీడి యా గొంతు నొక్క డం సరికాదు. దీనికి తగిన మూ ల్యం చెల్లించుకో వాల్సి వస్తుంది. నోటీసుల పేరుతో పోలీ సులు సాక్షి కార్యాలయం వద్ద హంగామా చేయడం అప్రజాస్వామికం. ఎడిటర్‌తో పాటు జర్నలిస్టులపై కేసులు ఎత్తివేయాలి. – ఎన్నం నాగార్జున,
ఓయూ విద్యార్థి జేఏసీ రాష్ట్ర కార్యదర్శి

అక్రమ కేసులు సరికాదు

అక్రమ కేసులు సరికాదు

అక్రమ కేసులు సరికాదు