
టీచర్ల సమస్యలు పరిష్కరించాలని వినతి
ఆసిఫాబాద్‌రూరల్: టీచర్ల సమస్యలు పరిష్కరించాలని గురువారం జిల్లా కేంద్రంలో అదనపు కలెక్టర్, డీఈవో దీపక్ తివారికి పీఆర్‌టీయూ నాయకులు వినతిపత్రం అందించారు. ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరావు మాట్లాడుతూ జిల్లాలో ఉపాధ్యాయుల సర్దుబాటు సరిచేయాలని, కుటుంబ సర్వేలో పనిచేసిన వారికి రెమ్యూనరేషన్, సమ్మర్ క్యాంపులు నిర్వహించిన స్కూళ్లకు నిధులు విడుదల చేయాలని, సప్లిమెంటరీ పరీక్షల విధులు నిర్వహించిన వారికి ఆర్జిత సెలవులు మంజూరు చేయాలని కోరారు. అనంతరం ఎమ్మెల్యే కోవ లక్ష్మిని కలిసి పాత పెన్షన్ విధానం అమలు చేయాలని విన్నవించారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి అనిల్‌కుమార్, నాయకులు రాకేశ్, శ్రావణ్‌కుమార్, రవి, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.