బోధించేవారేరి? | - | Sakshi
Sakshi News home page

బోధించేవారేరి?

Aug 25 2025 8:19 AM | Updated on Aug 25 2025 8:19 AM

బోధించేవారేరి?

బోధించేవారేరి?

మెడికల్‌ కాలేజీలో అధ్యాపకుల కొరత కళాశాలలో 97 పోస్టులు ఖాళీ రెండేళ్లయిన భర్తీ కాని వైనం విద్యార్థుల భవిష్యత్‌పై ప్రభావం

ఆసిఫాబాద్‌రూరల్‌: జిల్లాలో మెడికల్‌ కళాశాల ప్రారంభమై రెండు సంవత్సరాలు పూర్తి కావస్తోంది. అయినప్పటికీ నేటికీ కళాశాలలో పూర్తిస్థాయిలో బోధన సిబ్బందిని నియమించలేదు. ఉన్నవారితోనే ప్రస్తుతం తరగతులు కొనసాగిస్తున్నారు. ఖాళీల భర్తీ కోసం పలుమార్లు నోటిఫికేషన్‌ ఇచ్చినా జిల్లాలో అనుకున్న సౌకర్యాలు లేకపోవడంతో ఎవరూ ముందుకు రావడంలేదు. అంతేకాకుండా కళాశాల నిర్మాణ పనులు ఇప్పటి వరకు పూర్తికాకపోవడంతో విద్యార్థులు ఉండేందుకు పాత కలెక్టరేట్‌లో వసతి కల్పిస్తున్నారు.

ఆసక్తి చూపడం లేదు

జిల్లాలోని మెడికల్‌ కళాశాలలో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేసేందుకు పలుమార్లు దరఖాస్తులు ఆహ్వానించినా ఇక్కడ పనిచేసేందుకు బోధన సిబ్బంది ముందుకు రావడంలేదు. దీంతో ఉన్న వారితోనే చదువులు కొనసాగిస్తుండడంతో అప్పటికే రెండు సంవత్సరాలు గడిచిపోయాయి. ప్రొఫెసర్లను నియమించి కళాశాలలో సౌకర్యాలు కల్పించాలని జనవరి 2న విద్యార్థులు రెండు రోజుల పాటు ధర్నాలు సైతం నిర్వహించారు. సంబంధిత అధికారుల జోక్యం చేసుకుని విద్యార్థులకు నచ్చచెప్పి ఖాళీలు భర్తీ చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. కానీ ఇప్పటికీ ఖాళీలు భర్తీ చేయలేదు. ద్వితీయ సంవత్సరంలో అడుగుపెట్టినప్పటికీ ప్రొఫెసర్లు లేకపోవడంతో ఆ ప్రభావం విద్యార్థుల భవిష్యత్‌పై పడుతోంది. దీంతో ఇతర జిల్లా విద్యార్థులతో పోటీపడలేని పరిస్థితి నెలకొందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

భర్తీ కాని ఖాళీలు...

గత ప్రభుత్వ హయాంలో జిల్లా కేంద్రంలోని అంకుసాపూర్‌ గ్రామ పంచాయతీ పరిధిలో పూర్తిస్థాయిలో వసతులు కల్పించకుండానే మెడికల్‌ కళాశాల ప్రారంభించారు. ప్రస్తుతం ద్వితీయ సంవత్సరం త రగతులు కూడా కొనసాగుతున్నాయి. కళాశాలలో ఫస్టియర్‌, సెకండియర్‌ విద్యార్థులు 200 మంది వైద్యవిద్యను అభ్యసిస్తున్నారు. వారికి విద్యాబోధన చేసేందు కు కళాశాలలో మొత్తం 106 మంది సి బ్బంది ఉండాల్సి ఉంది. కానీ కేవలం 9 మంది మాత్రమే ప్రస్తుతం విధులు నిర్వహిస్తుండగా 97 పోస్టులు ఖాళీగానే ఉన్నా యి. వీటిలో ప్రొఫెసర్లు 27 మందికిగానూ నలుగురు ఉండగా 23 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అసోసియేట్‌ ప్రొఫెసర్లు 30 మందికిగానే ఒక్కరే ఉండగా 29 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు 58 మందికిగానూ నలుగురు మాత్రమే ఉండగా 54 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement