
నిరంతరం నాణ్యమైన విద్యుత్ సరఫరా
● టీజీఎన్‌పీడీసీఎల్ డైరెక్టర్ (ఆపరేషన్స్) మధుసూదన్
ఆసిఫాబాద్: జిల్లాలోని వినియోగదారులకు నిరంతరం నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని టీజీఎన్‌పీడీసీఎల్ డైరెక్టర్(ఆపరేషన్స్) మధుసూదన్ అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో శుక్రవారం చీఫ్ ఇంజినీర్ ఆపరేషన్– 1 అశోక్‌తో కలిసి విద్యుత్ శాఖ డీఈఈలు, ఏడీఈలు, ఏఈలు, సబ్ ఇంజినీర్లు, అధికరులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. మధుసూదన్ మాట్లాడుతూ నాణ్యమైన విద్యుత్ సరఫరాకు అన్నిరకాల పరికరాలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. జిల్లాలోని అన్ని సబ్ స్టేషన్లకు ప్రత్యామ్నాయ లైన్లు ఉండేలా చర్యలు తీసుకోవాలని, ట్రాన్స్‌ఫార్మర్ల ఫెయిల్యూర్లను తగ్గించడానికి మెయింటనెన్స్ చేపట్టాలని ఆదేశించారు. అన్ని లైన్లు పరిశీలించి ప్రమాదకరమైన లొకేషన్లు గుర్తించి, సరిచేయాలని సూచించారు. ఉద్యోగులు పనిచేసే సమయంలో భద్రతా పరికరాలు ఉపయోగిస్తూ ప్రమాదాలు నివారించాలన్నారు. అభివృద్ధి పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని సూచించారు.