
కాన్పుల మధ్య ఎడం తల్లీబిడ్డకు శ్రేయస్కరం
ఆసిఫాబాద్‌అర్బన్: కాన్పుల మధ్య సరైన ఎడం పాటించడం తల్లీబిడ్డకు శ్రేయస్కరమ ని మాతాశిశు సంరక్షణ ప్రోగ్రాం అధికారి డాక్టర్ సిద్దార్థ అన్నారు. ప్రపంచ జనాభా ది నోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని ఐడీఏసీ కార్యాలయం నుంచి ర్యాలీ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ప్రపంచ ఆరో గ్య సంస్థ ఈ ఏడాది ఆరోగ్యకరమైన సమ యం, కాన్పుల మధ్య దూరం తల్లీబిడ్డలకు శ్రేయస్కరం అనే నినాదాన్ని ఇచ్చిందని తెలి పారు. 15 నుంచి 49 ఏళ్లలోపు సీ్త్రలకు కుటుంబ నియంత్రణపై అవగాహన కల్పించాలన్నా రు. శాశ్వత కుటుంబ నియంత్రణతోపాటు తాత్కాలిక నియంత్రణ పద్ధతులైన ఐయూడీ, నిరోధ్, గర్భ నిరోధక సాధనాల వినియోగం గురించి వివరించాలని సూచించారు. జనా భా విస్పోటనాన్ని నియంత్రించేందుకు అవగాహన కల్పించాలన్నారు. వైద్యులు వినోద్, సిబ్బంది రవిదాస్ తదితరులు పాల్గొన్నారు.