ఆడపిల్లలం అని బాధపడలే..
కాగజ్‌నగర్‌టౌన్: కాగజ్‌నగర్ మండలం భట్టుపల్లి గ్రామంలో మాది నిరుపేద కుటుంబం. ఆమ్మానాన్న రామిళ్ల అంజమ్మ, సుధాకర్‌కు మేము ముగ్గురం రుచిత, రేష్మిత, తేజస్విని సంతానం. ఆడపిల్లలం అని బాధపడకుండా నాన్న కష్టపడి చదివించాడు. సిర్పూర్ పేపర్ మిల్లులో దినసరి కూలీ పనిచేసుకుంటూ ప్రభుత్వ పాఠశాలలకు పంపించాడు. మిల్లు మూతపడ్డాక కుటుంబ పోషణ కోసం మంచిర్యాల, పెద్దపల్లి, హైదరాబాద్‌లో పనిచేసి మేము ఉన్నతస్థితికి వచ్చేలా కృషి చేశాడు. నా పదో తరగతి పూర్తికాగానే ఖమ్మంలో అగ్రికల్చర్ డిప్లొమా చేశా. ప్రస్తుతం వ్యవసాయ శాఖలో కౌటాల మండలంలో కన్నెపల్లి ఏఈవోగా పనిచేస్తున్నాను. అక్క రుచిత బీఎస్సీ నర్సింగ్ చేసి ప్రస్తుతం రెబ్బెన మండలం నౌగాంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్‌గా విధులు నిర్వర్తిస్తోంది. చెల్లి తేజశ్విని ఏడో తరగతి చదువుతోంది. అమ్మ ఇంటి వద్దే ఉంటుంది. నాన్న ఇప్పటికీ కుటుంబం కోసం హైదరాబాద్‌లో ఒంటరిగా పనిచేస్తూ.. నెలకు ఒకసారి పండుగలకు ఇంటికి వస్తాడు. – రేష్మిత, ఏఈవో, కన్నెపల్లి


