
మోగిన బడిగంట
ఆసిఫాబాద్‌రూరల్/కాగజ్‌నగర్‌టౌన్/దహెగాం/రెబ్బెన: సుదీర్ఘ విరామం తర్వాత బడిగంట మళ్లీ మోగింది. గురువారం నుంచి 2025– 26 విద్యా సంవత్సరం ప్రారంభమైంది. తొలిరోజు ఉపాధ్యాయులు నిర్ణీత సమయం కంటే ముందుగానే పాఠశాలలకు చేరుకుని మామిడి తోరణాలతో ప్రవేశ మార్గాలను సుందరంగా తీర్చిదిద్దారు. పాఠ్యపుస్తకాలు, యూనిఫాం, నోట్‌పుస్తకాలు పంపిణీ చేశారు. సెలవుల్లో ఆటపాటలతో గడిపిన పిల్లలు మొదటిరోజు బడికి వెళ్లేందుకు మారాం చేయగా, తల్లిదండ్రులు వెంటబెట్టుకుని స్కూళ్లలో దింపారు. జిల్లాలో మొత్తం 729 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా, మొదటిరోజు సుమారు 3,289 మంది విద్యార్థులు హాజరయ్యారు. 25శాతం హాజరు నమోదైనట్లు అధికారులు తెలిపారు. కాగజ్‌నగర్ పట్టణంలోని వార్డు నంబర్ 14లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మొదటిరోజు నర్సరీ అడ్మిషన్లు తీసుకున్నారు. జెడ్పీహెచ్‌ఎస్(పెట్రోల్ పంప్)లో ఇన్‌చార్జి ప్రధానోపాధ్యాయుడు కేశవ్‌రావు, ఉపాధ్యాయులు మామిడాల తిరుపతయ్య, ఉపాధ్యాయులు విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందించారు.
ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు పెంచాలి
ఆసిఫాబాద్‌రూరల్: ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు పెంచాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. గురువారం ఆసిఫాబాద్ మండలంలోని చిర్రకుంట ప్రాథమికోన్నత పాఠశాలలో నిర్వహించిన బడిబాట కార్యక్రమానికి హాజరయ్యారు. విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, యూనిఫాం, నోట్‌పుస్తకాలు పంపిణీ చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల బలోపేతం కోసం ఉపాధ్యాయుల కృషి చేయాలన్నారు. బడిబాట కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లోని బడీడు పిల్లలను స్థానిక ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని సూచించారు. విద్యార్థులకు సకల వసతులతో నాణ్యమైన విద్యనందిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డీఆర్‌డీవో దత్తారావు, ఎస్‌వో మధుకర్, పరీక్షల నిర్వహణ అధికారి ఉదయ్‌బాబు, ఎంఈవో సుభాష్, మాజీ ఎంపీపీ మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.
పాఠశాలలు పునఃప్రారంభం తొలిరోజు హాజరు అంతంతే.. స్వాగతం పలికిన ఉపాధ్యాయులు విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, యూనిఫాం అందజేత
టీచర్లు లేట్
ఆసిఫాబాద్ మండలంలోని బూర్గుడ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు ఉత్సాహంగా ఉదయం 8:50 గంటలకే పాఠశాలకు వచ్చారు. స్కూల్‌లో 95 మంది విద్యార్థులు ఉండగా తొలిరోజు పదిమంది విద్యార్థులు హాజరయ్యారు. అయితే ఉపాధ్యాయులు ఆలస్యంగా రావడంతో గేట్ వద్ద వారంతా నిరీక్షించారు. పి ల్లలను ఆకట్టుకునేలా ఏర్పాట్లు సైతం చేయకపోవడంపై విమర్శలు వస్తున్నాయి.

మోగిన బడిగంట

మోగిన బడిగంట

మోగిన బడిగంట

మోగిన బడిగంట

మోగిన బడిగంట