● మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఎమ్మెల్యే ● చెన్నూర్‌ నుంచి అన్నయ్య తరువాత తమ్ముడికి అవకాశం ● ప్రేమ్‌సాగర్‌ రావు, వినోద్‌కు ఆశాభంగం | - | Sakshi
Sakshi News home page

● మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఎమ్మెల్యే ● చెన్నూర్‌ నుంచి అన్నయ్య తరువాత తమ్ముడికి అవకాశం ● ప్రేమ్‌సాగర్‌ రావు, వినోద్‌కు ఆశాభంగం

Jun 9 2025 7:41 AM | Updated on Jun 9 2025 7:41 AM

● మంత

● మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఎమ్మెల్యే ● చెన్నూర్‌

సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: మంత్రిగా చెన్నూర్‌ ఎమ్మెల్యే గడ్డం వివేక్‌ వెంకటస్వామి ఆదివారం రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం చేశారు. చెన్నూర్‌ నుంచి వరుసగా ఆయన సోదరుడు వినోద్‌ తరువాత మంత్రిగా బాధ్యతలు చేపట్టి రికార్డు సృష్టించారు. ఇప్పటికే గడ్డం ఫ్యామిలీ నుంచి బెల్లంపల్లి ఎమ్మెల్యేగా వినోద్‌ ఉండగా ఎంపీగా వంశీకృష్ణ కొనసాగుతున్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికా రంలోకి వచ్చినప్పటి నుంచే వివేక్‌కు మంత్రి మండలిలో చోటు దక్కుతుందని ఊహాగా నాలు వెలువడ్డాయి. అయినప్పటికీ జిల్లా నుంచే మరో ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు, వినోద్‌ సైతం పోటీలో ఉండగా చివరకు అధిష్టానం వివేక్‌కే మంత్రి పదవి కట్టబెట్టింది. వివేక్‌ వర్గీయులు శనివారం నుంచే సంబురాలు చేసుకుంటున్నారు.

కాంగ్రెస్‌ శ్రేణుల సంబురాలు

చెన్నూర్‌ ఎమ్మెల్యే గడ్డం వివేక్‌వెంకటస్వామికి మంత్రి పదవి రావడంతో చెన్నూర్‌లో కాంగ్రెస్‌ పార్టీ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. చెన్నూర్‌ పట్టణానికి చెందిన కాంగ్రెస్‌పార్టీ నాయకులు మంత్రి ఎమ్మెల్యే వివేక్‌ వెంకటస్వామిని కలిసి శాలువా కప్పి పుష్పగుచ్చం అందజేసి శుభా కాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో చింతల శ్రీనివాస్‌ పాల్గొన్నారు. భీమారంలోని జాతీయ రహదారిపై టపాసులు కాల్చారు. దండేపల్లిలో మాల సామాజిక వర్గం నాయకులు సంబరాలు జరుపుకున్నారు.

మంత్రిని కలిసిన నాయకులు

మంత్రి గడ్డం వివేక్‌ వెంకటస్వామిని మంచిర్యాలకు చెందిన తెలంగాణ రాష్ట్ర మున్సిపల్‌ కాంట్రా క్టు కార్మిక సంఘం అధ్యక్షుడు సుదమల్ల హరికృష్ణ, తెలంగాణప్రదేశ్‌ కాంగ్రెస్‌ సేవాదళ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్డర్‌ నీలకంఠేశ్వర్‌రావు, మందమర్రి కాంగ్రెస్‌పార్టీ మండల అధ్యక్షుడు నీల య్య, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు గందె రాంచందర్‌, కోటపల్లి మాజీ సర్పంచ్‌లు కుమ్మరిసంతోష్‌, గట్టు లక్ష్మణ్‌గౌడ్‌, జేక శేఖర్‌, ప్రభాకర్‌, నాయకులు గుర్రం రాజన్న తదితరులు కలిసి అభినందనలు తెలియజేశారు.

● మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఎమ్మెల్యే ● చెన్నూర్‌ 1
1/1

● మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఎమ్మెల్యే ● చెన్నూర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement