‘పొట్టేల్‌’ సినిమాకు గద్దర్‌ అవార్డు | - | Sakshi
Sakshi News home page

‘పొట్టేల్‌’ సినిమాకు గద్దర్‌ అవార్డు

May 30 2025 1:48 AM | Updated on May 30 2025 1:48 AM

‘పొట్టేల్‌’ సినిమాకు గద్దర్‌ అవార్డు

‘పొట్టేల్‌’ సినిమాకు గద్దర్‌ అవార్డు

నిర్మల్‌రూరల్‌: జిల్లా కేంద్రానికి చెందిన సాహిత్‌ మోత్కూరి దర్శకత్వం వహించిన పొట్టేల్‌ సినిమాకు గద్దర్‌ అవార్డు లభించింది. గురువారం హైదరాబాద్‌లో ప్రభుత్వం గద్దర్‌ అవార్డులను ప్రకటించగా పొట్టేల్‌ సినిమాకు ‘సెకండ్‌ బెస్ట్‌ ఫీచర్‌ ఫిల్మ్‌’ అవార్డు దక్కింది. జిల్లా కేంద్రంలోని ప్రియదర్శినగర్‌లో నివాసం ఉండే జానకి, ధర్మగౌడ్‌ కుమారుడు సాహిత్‌ దర్శకత్వం వహించగా గత అక్టోబర్‌ 25న చిత్రం విడుదలై విజయం సాధించింది. సాహిత్‌ దర్శకత్వం వహించిన మొదటి సినిమా ‘సవారి’కి కూడా 2020లో ఐఐఎఫ్‌ఏ ఉత్తమ క్రిటిక్స్‌ అవార్డు లభించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement