
కమీషన్ల కోసమే ‘కాళేశ్వరం’ నిర్మాణం
బెజ్జూర్(సిర్పూర్): బీఆర్‌ఎస్ ప్రభుత్వ హ యాంలో కమీషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారని రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ రియాజ్ అన్నారు. బెజ్జూర్ మండల కేంద్రంలో ఆదివారం నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశానికి ఎమ్మెల్సీ దండె విఠల్‌తో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రియాజ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును తుమ్మిడిహెట్టి వద్ద నిర్మించి ఉమ్మడి ఆదిలా బాద్ జిల్లాకు నీరందిస్తామని హామీ ఇచ్చారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును రద్దు చేసిందని, కాళేశ్వరం ప్రాజెక్టుతో ఈ ప్రాంతానికి అన్యాయం జరిగిందని ఎమ్మెల్సీ విఠల్ అన్నారు. సుశ్మీర్‌లో ఇందిరమ్మ ఇళ్లు నిర్మించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. అంతకుముందు రియాజ్, అన్నయ్య గౌడ్‌లను శాలువాలతో ఘనంగా సత్కరించారు.
కాంగ్రెస్‌తోనే అభివృద్ధి సాధ్యం
కౌటాల: కాంగ్రెస్‌తోనే దేశాభివృద్ధి సాధ్యమ ని గ్రంథాలయ సంస్థ రాష్ట్ర చైర్మన్ రియాజ్ అన్నారు. మండల కేంద్రంలో ఆదివారం రాత్రి నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. ఆయా కార్యక్రమాల్లో డీసీసీ జిల్లా అధ్యక్షుడు విశ్వప్రసాద్‌రావు, జెడ్పీ మాజీ చైర్మన్ గణపతి, మాజీ జెడ్పీటీసీలు శారద జగ్గాగౌడ్, పుష్పలత, టీపీసీసీ మెంబర్ అర్షద్ హుస్సేన్, మండల అధ్యక్షులు విశ్వేశ్వరరావు, గంగారాం పాల్గొన్నారు.