
ప్రజావాణి దరఖాస్తులు త్వరగా పరిష్కరించాలి
ఆసిఫాబాద్‌అర్బన్: ప్రజావాణి కార్యక్రమంలో వ చ్చిన దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ వెంకటేష్ దోత్రే సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ డేవిడ్‌తో కలిసి ప్రజ ల నుంచి అర్జీలు స్వీకరించారు. ఆసిఫాబాద్ పట ణం సందీప్‌నగర్‌కు చెందిన దుర్గం సంగీత తన కూతురుకు దివ్యాంగ పింఛన్ ఇప్పించాలని, ఆసిఫాబాద్ మండలం ఎల్లారంకు చెందిన ఆరిందుల సుధాకర్ తాను కొనుగోలు చేసిన భూమికి పట్టా పాసుపుస్తకం ఇవ్వాలని, జైనూర్ మండలం సోనుపటేల్ గూడకు చెందిన మిశ్రమ తూర్పుబాయ్ ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని, ఆసిఫాబాద్ మండలం రహపల్లికి చెందిన మారిశెట్టి గురువయ్య తన భూమికి కొలతలు చేయించాలని, జైనూర్ మండలం ఊసేగాంకు చెందిన మడావి శ్యాంసుందర్ తనకు గ్రామ పంచాయతీలో కామాటీగా ఉపాధి కల్పించాలని దరఖాస్తులు సమర్పించారు.
● కలెక్టర్ వెంకటేష్ దోత్రే