రక్తదానం.. మరొకరికి ప్రాణదానం
● ఏఎస్పీ చిత్తరంజన్
వాంకిడి(ఆసిఫాబాద్): రక్తదానం మరొకరికి ప్రాణదానం వంటిదని ఏఎస్పీ చిత్తరంజన్ అన్నా రు. బాబాసాహెబ్ అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని అంబేడ్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో వాంకిడి మండల కేంద్రంలోని జేత్వాన్ బుద్ధ విహార ఆవరణలో ఆదివారం ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత ఆపదలో ఉన్నవారికి రక్తం దానం చేయడంలో ముందుండాలని పిలుపునిచ్చారు. తద్వారా ఒకరి ప్రాణాలు నిలబెట్టిన వారవుతారని అన్నారు. సమాజ సేవలో బా ధ్యతగా ఉంటూ వ్యక్తిగత ఎదుగుదలపై దృష్టి సా రించాలని సూచించారు. మహనీయుని జయంతి సందర్భంగా సామాజిక కార్యక్రమం నిర్వహించ డం అభినందనీయమని కొనియాడారు. రక్తదానం చేసిన యువకులను అభినందించారు. 22 యూని ట్ల రక్తం సేకరించి ఆసిఫాబాద్ రక్తనిధి కేంద్రానికి అప్పగించినట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో సీఐ సత్యనారాయణ, రక్తనిధి కేంద్రం వై ద్యుడు అమ్జద్, బౌద్ధ సంఘం, బీఎస్‌ఐ, సిద్దార్థ యువజన సంఘం, సమతా సైనిక్ దళ్, రమాబా యి మహిళా సంఘం నాయకులు పాల్గొన్నారు.
కాంగ్రెస్‌తోనే అభివృద్ధి
కౌటాల(సిర్పూర్): కాంగ్రెస్ పార్టీతోనే గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి సాధ్యమవుతుందని ఎమ్మెల్సీ దండె విఠల్ అన్నారు. కౌటాల మండలం మొగడ్‌దగడ్ గ్రామంలో ఆదివారం రాత్రి జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని కించపరుస్తు న్న బీజేపీకి రానున్న ఎన్నికల్లో బుద్ధి చెప్పాలన్నారు. బీజేపీ పాలనలో దేశంలో అభివృద్ధి జరగడం లేదని ఆరోపించారు. అంతకుముందు పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరగా, వారికి కండువా కప్పి ఆహ్వానించా రు. కార్యక్రమంలో నాయకులు ఖాళీం, భూషన్, ఉ ద్దవ్, కార్తీక్, సుదర్శన్, సంతోష్, వినోద్, సోను, జో గు, భాస్కర్, పోశం తదితరులు పాల్గొన్నారు.


