ఖమ్మంక్రైం: మనుగడలో లేని సంస్థ పేరిట నకిలీ పత్రాలు సృష్టించి, విద్యార్థులకు శిక్షణ ఇస్తామంటూ నమ్మబలికి ఖమ్మంలోని ఓ ప్రముఖ విద్యాసంస్థ నుంచి రూ.10 లక్షలు తీసుకుని ముఖం చాటేసిన వ్యక్తిని సైబర్ పోలీసులు అరెస్ట్ చేశారు. జిల్లాకు చెందిన ఓ ప్రముఖ విద్యాసంస్థ బాధ్యులను వాట్సప్ ద్వారా ఓ వ్యక్తి పరిచయం చేసుకున్నాడు. హైదరాబాద్ ఐఐటీలో తాను ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నానని, విద్యార్థులకు శిక్షణ ఇస్తానని నమ్మించా డు. అంతేకాక నకిలీ పత్రాలు, నకిలీ ఎంఓయూ లను ఆన్‌లైన్‌లో పంపించి రూ.10 లక్షలు తీసుకున్నాడు. అయితే, సదరు వ్యక్తి ప్రొఫెసర్ కాదని, తమను మోసం చేశాడని తెలుసుకున్న విద్యాసంస్థ బాధ్యులు ఇచ్చిన ఫిర్యాదుతో నగదు జమ అయిన వ్యక్తిని డి.రవికిరణ్‌గా గుర్తించి హైదరాబాద్‌లో అరెస్ట్ చేశామని ఖమ్మం సైబర్ క్రైం పోలీసులు తెలిపారు. కేసు విచారణలో ముఖ్య పాత్ర పోషించిన డీఎస్పీ ఫణీందర్, సీఐ భూక్యా రవికుమార్, ఎస్‌ఐలు రంజిత్, విజయకుమార్, కానిస్టేబుల్ కృష్ణారావు, నాగేశ్వరరావును సీపీ సునీల్‌దత్ అభినందించారు.
నిందితుడిని అరెస్ట్ చేసిన
సైబర్ క్రైమ్ పోలీసులు


