మండల స్థాయిలో ప్రతిభ చాటా.. | - | Sakshi
Sakshi News home page

మండల స్థాయిలో ప్రతిభ చాటా..

May 1 2026 6:03 AM | Updated on May 1 2026 6:03 AM

మండల స్థాయిలో ప్రతిభ చాటా.. అత్యధిక మార్కులకు.. 554 మార్కులు సాధించా..

‘సాక్షి’ యాజమాన్యం పరీక్షలకు రెండు నెలల ముందు సబ్జెక్టుల మెటీరియల్‌ అందించింది. తద్వారా తక్కువ సమయంలో మోడల్‌ పేపర్లు ప్రాక్టీస్‌ చేశాను. ఇందులో చాలా ప్రశ్నలు వచ్చాయి. ఫలితంగా 542 మార్కులతో నేను మండల స్థాయిలో సత్తా చాటా.

– మద్దికుంట్ల మధువిక, జెడ్పీహెచ్‌ఎస్‌, ముష్టికుంట్ల

పరీక్షలకు తక్కువ సమయమే ఉన్నా ‘సాక్షి’ నుంచి అందిన స్టడీ మెటీరియల్‌ ఆధారంగా మోడల్‌ పేపర్లు ప్రాక్టీస్‌ చేశాను. తద్వారా వార్షిక పరీక్షల్లో 540 మార్కులు సాధించగలిగా. ఇన్ని మార్కులు సాధించడానికి మెటీరియల్‌ ఎంతగానో నాకు ఉపయోగపడింది.

– పులిబోయిన కార్తీక్‌, జెడ్పీహెచ్‌ఎస్‌, ముష్టికుంట్ల

మాకు ‘సాక్షి’ ద్వారా ఇచ్చిన మెటీరియల్‌ ఎంతో ఉపయోగపడింది. ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్న సమయాన ఈ మెటీరియల్‌ అందింది. అప్పటి నుంచి ఉపాధ్యాయులు చెప్పే పాఠాలకు తోడు ఇవి చదవడంతో 554 మార్కులు సాధించా.

– ఎస్‌.కే.రబియా భాను,

పాతసెంటర్‌ హైస్కూల్‌, సత్తుపల్లి

Advertisement
 
Advertisement
Advertisement