విశ్రాంత ఉద్యోగుల బకాయిలు చెల్లించాలి
ఖమ్మంమయూరిసెంటర్: రిటైర్డ్ ఉద్యోగుల పెండింగ్ బకాయిలతో పాటు డీఏలు, పీఆర్సీలను వెంటనే చెల్లించాలని మాజీ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి డిమాండ్ చేశారు. ఖమ్మంలోని మంచికంటి హాల్‌లో గురువారం జరగిన తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్ల అసోసియేషన్ జిల్లా సభలో ఆయన మాట్లాడారు. 2024 తర్వాత పదవీ విరమణ చేసిన వారి బకాయిలు విడుదల చేయడంతో పాటు ఉద్యోగులకు పెండింగ్ ఐదు డీఏలు, పీఆర్సీ వెంటనే ప్రకటించాలన్నారు. అయితే, బలమైన ఉద్యమాలతోనే ప్రభుత్వం స్పందిస్తుందనే విషయాన్ని గుర్తించి సంఘాలు కార్యాచరణ రూపొందించాలని సూచించారు. టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు గుంటుపల్లి శ్రీనివాసరావు, పెన్షనర్స్ అండర్ రిటైర్డ్ పర్సర్ల అసోసియేషన్ నాయకులు సీహెచ్.విద్యాసాగర్, అరుణ, కళ్యాణం నాగేశ్వరరావు, బాల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
మాజీ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి


