27నుంచి రెండు రాష్ట్రాల స్థాయి బ్యాడ్మింటన్ టోర్నీ
ఖమ్మం స్పోర్ట్స్: రెండు రాష్ట్రాల స్థాయి పులి రామస్వామి స్మారక బాల్ బ్యాడ్మింటన్ టోర్నీ ఈనెల 27, 28వ తేదీల్లో నిర్వహిస్తున్నట్లు టోర్నీ కన్వీనర్ డాక్టర్ రాధాకృష్ణమూర్తి తెలిపారు. ఖమ్మంలో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ టోర్నీ సర్దార్ పటేల్ స్టేడియంలో జరుగుతుందని తెలిపారు. బాల్ బ్మాడ్మింటన్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం నిర్వహించే టోర్నీలో పాల్గొనేందుకు రెండు తెలుగు రాష్ట్రాల క్రీడాకారులు 20వ తేదీలోపు ఎంట్రీలు సమర్పించాలని సూచించారు. ఈసమావేశంలో కోకన్వీనర్ టి.రామచంద్రరాజుతో పాటు విజయ్ కలాం, డాక్టర్ పులి మధు, శంకరమూర్తి, తిరుపతిరెడ్డి, బద్రి, శ్రీకాంత్, తాజ్‌వుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.


