‘పోస్టు’ మారింది!
తల్లాడ: మండలంలోని కొడవటిమెట్ట వాసి, పోస్టుబాయ్‌గా పనిచేసిన మోదుగు తిరుమలరావు సర్పంచ్ ఎన్నికయ్యాడు. తల్లాడ పోస్టుమాస్టర్ ద్వారా ఆయన స్థానికంగా ఉత్తరాలు పంపిణీ చేశారు. కొడవటిమెట్ట పంచాయతీ సర్పంచ్ స్థానం ఎస్సీలకు రిజర్వ్ కావడంతో తిరుమలరావు కాంగ్రెస్ మద్దతుతో పోటీ చేశారు. బీఆర్‌ఎస్ మద్దతు తెలిపిన అభ్యర్థి మోదుగు నాగేశ్వర్‌రావుపై 70 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
తల్లాడ: మండలంలోని బాలపేటలో గత ఎన్నికల్లో భర్త సర్పంచ్‌గా గెలవగా.. ఇప్పుడు ఆయన భార్య విజయం సాధించింది. 2019లో జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో బాలపేట సర్పంచ్‌గా కోసూరి వెంకటనరసింహారావు విజయం సాధించాడు. తాజా ఎన్నికల్లో ఆయన భార్య కోసూరి ధనలక్ష్మి.. సమీప అభ్యర్థి పాలెపు కుమారిపై 86 ఓట్ల మెజార్టీతో గెలుపొందింది. దీంతో మరో ఐదేళ్ల పాటు ఈ కుటుంబం చేతిలోనే పాలన సాగనుంది.
దంపతులిద్దరూ
వార్డుసభ్యులే..
సత్తుపల్లిరూరల్: సత్తుపల్లి మండలం బేతుపల్లి పంచాయతీలో 10, 11వ వార్డుల నుంచి భార్యాభర్తలు ఇండిపెండెంట్ పోటీ చేసి విజయం సాధించారు. ఇందులో 10వ వార్డు నుంచి గుండిపూడి రమేష్, 11వ వార్డు నుంచి ఆయన భార్య గండిపూడి యశోద గెలిచారు. ఈ పంచాయతీలో సర్పంచ్‌గా కూడా ఇండిపెండెంట్ అభ్యర్థి దొడ్డా రాజేంద్రప్రసాద్(అమ్ములు) విజయం సాధించగా, 12మంది వార్డు సభ్యులు కూడా స్వతంత్ర అభ్యర్థులే కావడం విశేషం.
‘పోస్టు’ మారింది!
‘పోస్టు’ మారింది!
‘పోస్టు’ మారింది!


