గ్రూప్–3లో జిల్లా వాసుల సత్తా
ఖమ్మంమయూరిసెంటర్/ముదిగొండ: ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ వార్డు ఆఫీసర్, కమిషనర్ సీసీగా విధులు నిర్వర్తిస్తున్న బెందు వీరబాబు సీనియర్ అకౌంటెంట్ ఆఫీసర్‌గా ఎంపికయ్యారు. టీజీపీఎస్సీ గురువారం రాత్రి విడుదల చేసిన గ్రూప్–3 ఫలితాల్లో వీరబాబు ఎస్‌ఏఓగా ఎంపికవగా జోన్–4కు కేటాయించారు. ముదిగొండ మండలం బాణాపురం గ్రామానికి చెందిన వీరబాబు 17ఏళ్లు ఆర్మీలో విధులు నిర్వర్తించాక పోలీస్ శాఖలో ఎస్‌ఐ, కానిస్టేబుల్, గ్రూప్–3, 4, ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఉద్యోగాల కోసం పరీక్షలు రాశారు. ఇందులో కానిస్టేబుల్, గ్రూప్–4, ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఉద్యోగాలకు ఎంపికై న ఆయన గ్రూప్–4ద్వారా కేఎంసీలో వార్డు ఆఫీసర్‌గా చేరారు. ప్రస్తుతం కమిషనర్ వద్ద సీసీగా విధులు నిర్వర్తిస్తున్న వీరబాబు గ్రూప్–3లోనూ ఎంపికయ్యాడు. ఈమేరకు ఎస్‌ఏఓ ఉద్యోగానికి ఎంపికై న వీరబాబును కేఎంసీ ఉద్యోగులు, బాణాపురం వాసులు అభినందించారు. అలాగే, బాణాపురం గ్రామానికే చెందిన పానకాల వెంకటేశ్వర్లు కుమారుడు నరేష్ సైతం గ్రూప్–3లో మెరుగైన ర్యాంకు సాధించి ఉద్యోగానికి ఎంపికయ్యాడు. గతంలోనూ పలు ఉద్యోగ పరీక్షలు రాసిన ఆయన ఫలితం లేకపోవడంతో నిరాశ చెందకుండా గ్రూప్–3కు సిద్ధమయ్యాడు. ఈమేరకు మెరుగైన ర్యాంకుతో పంచాయతీరాజ్ శాఖలో ఉద్యోగానికి ఎంపికై నట్లు ఫలితాలు వెలువడగా నరేష్‌ను గ్రామస్తులు అబినందించారు.
గోవింద్రాల బంజర వాసి..
కామేపల్లి: కామేపల్లి మండలం గోవింద్రాల బంజరకు చెందిన గంగారపు సాయి కృష్ణమనాయుడు మరో ఉద్యోగం సాధించాడు. గ్రామానికి చెందిన సత్యనారాయణ–జ్యోతిర్మయి పెద్దకుమారుడైన ఈయన ఇప్పటికే పలు ఉద్యోగ పరీక్షల్లో సత్తా చాటి రంగారెడ్డి జిల్లా కోర్టులో రికార్డు అసిస్టెంట్‌గా పనిచేశాక ఖమ్మం డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. గురువారం రాత్రి విడుదలైన గ్రూప్–3 ఫలితాల్లోనూ ప్రతిభ కనబరిచి ఎంపికై ట్రెజరీ డిపార్ట్‌మెంట్‌లో సీనియర్ అసిస్టెంట్‌గా ఉద్యోగం సాధించాడు. కాగా, ఇదిలా ఉండగా సాయికృష్ణ భార్య నెల్లూరి కవిత ప్రభుత్వ ఉపాధ్యాయురాలుగా పనిచేస్తోంది. ఆయన సోదరుడు రత్నేశ్వరనాయుడు నాలుగు ఉద్యోగాలు సాధించి ప్రసుత్తం కొత్తగూడెంలో అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్(ఏటీఓ)గా పనిచేస్తుండగా, ఆయన భార్య మైసా ఉజ్వల హైదరాబాద్ సెక్రటేరియట్‌లో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్(ఏఎస్‌ఓ)గా విధులు నిర్వర్తిస్తోంది.
బాణాపురం వాసులు ఇద్దరి ఎంపిక
గ్రూప్–3లో జిల్లా వాసుల సత్తా
గ్రూప్–3లో జిల్లా వాసుల సత్తా


