ఖమ్మంలో 26 అడుగులకు చేరి
నెమ్మదిగా తగ్గుతున్న ప్రవాహం
ఎనిమిది కాలనీల్లోకి చేరిన నీరు..
పునరావాస కేంద్రాలకు ప్రజల తరలింపు
మున్నేటి వరద వివరాలు
మున్నేటిపై
ఖమ్మంమయూరిసెంటర్: మోంథా తుపాన్‌తో కురుస్తున్న వానలు తగ్గినా ఆ ప్రభావం మాత్రం ఖమ్మంను వీడడం లేదు. తుపాన్ ప్రభావంతో జిల్లాతో పాటు ఎగువన కురిసిన భారీ నుండి అతిభారీ వర్షాలతో మున్నేరు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ వరద రెండు రోజుల నుంచి క్రమంగా పెరుగుతుండడంతో ఎంత వరద వస్తుందో అధికారులు కూడా అంచనా వేయలేకపోతున్నారు. ఎగువన వర్షాలు తగ్గుముఖం పట్టినా వరద అదే స్థాయిలో ఉండడం ఆందోళన కలిగించింది. గత ఏడాది అనుభవంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు ముందుగానే పునరావాస కేంద్రాలకు తరలించారు. బుధవారం రాత్రి 11గంటలకు ఖమ్మం కాల్వొడ్డు వద్ద 20అడుగుల మేర ప్రవహించిన మున్నేరు క్రమంగా పెరుగుతూ గురువారం సాయంత్రం 5గంటలకల్లా 26అడుగులకు చేరింది. ఆతర్వాత నెమ్మదిగా తగ్గుతూ రాత్రి 10గంటలకు 25అడుగులుగా నమోదైంది. అప్పటికే ఎనిమిది కాలనీలు నీటమునిగాయి.
రెండు రోజులుగా..
మున్నేరుకు ఎంత భారీ వరద వచ్చినా 24 గంటల్లో తగ్గుముఖం పడుతుంది. కానీ మోంథా ప్రభావంతో బుధవారం మధ్యాహ్నం ఒంటి గంటకు మొదలైన వరద గురువారం సాయంత్రం 26 అడుగులకు చేరింది. కాల్వొడ్డు వద్ద 20 అడుగులకు పైగా వరద 24 గంటలకు పైగా ప్రవహించడం ఇదే తొలిసారి. బుధవారం అర్ధరాత్రి తర్వాత వరద నిలకడగా ఉండడంతో తగ్గుతుందంటూ అధికారులు, ముంపు ప్రాంతాల ప్రజలు భావించారు. కానీ అందుకు విరుద్ధంగా పెరుగుతుండడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. గురువారం మధ్యాహ్నం 12గంటల నుండి 2.30 గంటల వరకు 25 అడుగుల వద్దే నిలకడగా కనిపించిన మున్నేటి వరద కాసేపటికే పెరగ డం... సాయంత్రం 6 గంటలకు 26 అడుగులుగా నమోదు కావడంతో ఆందోళన చెందారు. ఈమేరకు బుధవారం సాయంత్రం నుంచి కంటి మీద కునుకు లేకుండా మున్నేరు పరీవాహకంలోనే అధికారులు మకాం వేయాల్సి వచ్చింది.
అటు మున్నేరు.. ఇటు బ్యాక్ వాటర్
మున్నేటి వరదతో పలు కాలనీలు ముంపునకు గురవుతుండగా.. బ్యాక్ వాటర్ కూడా కాలనీల్లోకి చేరుతోంది. మున్నేరుకు భారీ వరద వస్తుండడంతో వెంకటేశ్వరనగర్, పద్మావతినగర్, బొక్కలగడ్డ, మోతీనగర్, పంపింగ్‌వెల్ రోడ్డు, పెద్దమ్మతల్లి గుడి వెనుక, ధంసలాపురం కాలనీల్లోని పలు వీధుల్లోకి వరద నీరు చేరింది. ఇక బ్యాక్ వాటర్‌తో మోతీనగర్‌లోని ఓ ప్రాంతం, సారధినగర్, ధంసలాపురం కాలనీల్లో ఇళ్ల చుట్టూ నీరు చేరింది. దీంతో ఆయా కాలనీల్లోని పలు ఇళ్లను అధికారులు ఖాళీ చేయించారు. అయితే, గురువారం రాత్రి నుంచి వరద తగ్గుముఖం పడుతున్నా అధికారులు అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు సూచనలు చేస్తున్నారు.
రెండు రోజులుగా భారీ వరద
సమయం వరద
(అడుగుల్లో)
బుధవారం రాత్రి 8.30 18.5
10 19.25
10.45 19.5
11.30 20.25
అర్థరాత్రి 12.30 గంటలకు 21
గురువారం
తెల్లవారుజామున 1.30 21.5
2.30 22
3.30 22.5
4.30 23
ఉదయం 5.30 23.5
6.30 23.8
7 24
8 24.3
9 24.5
10 24.8
11 25
మధ్యాహ్నం 12 25.3
1 గంటకు 25.3
2 25.3
3 25.50
సాయంత్రం 4 25.80
5 25.80
6 26
10 25
మోంథా పడగ..
మోంథా పడగ..
మోంథా పడగ..

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
