 
															సదరమ్ శిబిరానికి పోటెత్తారు..
ఖమ్మంవైద్యవిభాగం: ఖమ్మం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో నిర్వహిస్తున్న సదరమ్ శిబిరాలకు దివ్యాంగులు పోటెత్తుతున్నారు. గతంలో శిబిరం ఏర్పాటుచేసే ముందు రోజే ఆన్‌లైన్‌లో స్లాట్ నమోదుకు అవకాశం ఉండేది. అందులో కొందరికే పరీక్షలు నిర్వహించేవారు. కానీ ప్రస్తుతం ఎందరైనా స్లాట్ బుక్ చేసుకునే వీలు కల్పించగా, జిల్లాలో 2వేల మంది వరకు వేచి చూస్తున్నారు. దీంతో పెద్దాస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ నరేందర్ వెంటవెంటనే శిబిరాలు ఏర్పాటు చేయిస్తున్నారు. అయితే, కొందరికి అర్హత లేకున్నా స్లాట్ బుక్ చేసుకుంటుండగా, మరికొందరు దళారులను నమ్మి వస్తున్నారు. ఫలితంగా శిబిరానికి వచ్చే వారిలో మూడో వంతు మంది కూడా అర్హత సాధించడం లేదు. కాగా, గురువారం శిబిరానికి 300మంది స్లాట్ బుక్ చేసుకోగా, 165మంది వారి బంధువులతో హాజరుకావడంతో ఆవరణ కిక్కిరిసిపోయింది.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
