పురపాలికలకు నిధుల వరద | - | Sakshi
Sakshi News home page

పురపాలికలకు నిధుల వరద

Oct 26 2025 8:37 AM | Updated on Oct 26 2025 8:37 AM

పురపాలికలకు నిధుల వరద

పురపాలికలకు నిధుల వరద

● కేఎంసీకి రూ.40కోట్లతో ప్రతిపాదన.. రూ.50కోట్ల కేటాయింపు ● ఏదులాపురం మున్సిపల్‌కు రూ.15 కోట్ల మంజూరు

ఏదులాపురం మున్సిపాలిటీ అభివృద్ధికి మంజూరైన నిధులు

కార్పొరేషన్‌, మున్సిపాలిటీల అభివృద్ధిలో ముందడుగు
● కేఎంసీకి రూ.40కోట్లతో ప్రతిపాదన.. రూ.50కోట్ల కేటాయింపు ● ఏదులాపురం మున్సిపల్‌కు రూ.15 కోట్ల మంజూరు

ఖమ్మంమయూరిసెంటర్‌: రాష్ట్రంలోని పట్టణాలు, నగరాల రూపురేఖలు మార్చేందుకు ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. నిధుల లేమితో స్తంభించిన అభివృద్ధికి తిరిగి ఊపందుకునేలా ప్రత్యేక నిధులను మంజూరు చేసింది. సీఎం రేవంత్‌రెడ్డి ఇటీవల చేసిన ప్రకటనకు అనుగుణంగా తక్షణమే నిధులు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. నగరాలు, పట్టణాల అభివృద్ధికి నిధులు మంజూరు చేయగా, కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిసింది. ఈమేరకు రెండు నెలల క్రితమే ప్రభుత్వం ప్రతిపాదనలు స్వీకరించగా వాటికి మరికొంత మొత్తాన్ని కలిపి నిధులు కేటాయించేలా ప్రభుత్వం సీడీఏఎంకు సూచించినట్లు సమాచారం.

కేఎంసీకి రూ.50 కోట్లు

ఖమ్మం నగర పాలక సంస్థ నుంచి రూ.40 కోట్ల విలువైన పనులకు ప్రతిపాదనలను అధికారులు పంపించారు. కానీ రాష్ట్రంలోని అన్ని కార్పొరేషన్లకు ఒకే రకంగా నిధులు ఇవ్వాలనే ప్రభుత్వ సూచనలతో కేఎంసీకి రూ.50 కోట్లు కేటాయించినటు్‌ల్‌ సమాచారం. ఈ నిధులతో కార్పొరేషన్‌ పరిధిలో పెండింగ్‌ ఉన్న డ్రెయినేజీలు, రోడ్లు, కూడళ్ల సుందరీకరణ వంటి పనులు చేపడుతారు.

కొత్త పట్టణాలకే సింహభాగం

నిధుల కేటాయింపులో భాంగా ప్రభుత్వం కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీలు, అభివృద్ధిలో వెనుకబడిన ప్రాంతాలపై ప్రధాన దృష్టి సారించింది. ఈక్రమంలోనే కొన్ని పురపాలక సంస్థలకు తక్షణమే నిధులను మంజూరు చేస్తూ జీఓలు విడుదలయ్యాయి. జిల్లాలోని ఏదులాపురం మున్సిపాలిటీకి ఏకంగా రూ.15 కోట్లు మంజూరు చేయడం విశే షం. ఈ నిధులను పార్కులు, అంతర్గత రోడ్లు, డ్రెయినేజీల వ్యవస్థ బలోపేతంతో పాటు విలీన ప్రాంతాల సమగ్రాభివృద్ధికి వినియోగించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

నేరుగా అనుమతులు

అభివృద్ధి పనుల కోసం మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల నుండి పంపిన ప్రతిపాదనలను ప్రభుత్వం ఫాస్ట్‌ ట్రాక్‌ పద్ధతిలో పరిశీలించి నేరుగా పరిపాలనా అనుమతులు ఇవ్వనుంది. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో అభివృద్ధి పనులకు స్థానిక పాలకవర్గాల నుండే అనుమతులు తీసుకుంటుంటారు. కానీ ఇప్పుడు పాలకవర్గాలు, ప్రత్యేక అధికారులతో సంబంధం లేకుండానే ప్రభుత్వమే నేరుగా పనులు అనుమతి ఇవ్వనున్నట్లు అధికారవర్గాల ద్వారా తెలిసింది. అంతేకాక పనులు పూర్తయిన వెంటనే నిధులు మంజూరు చేస్తారని సమాచారం.

రెండు రోజుల్లో....

జిల్లాలో ఖమ్మం మున్సిపల్‌ కార్పొరేషన్‌తో పాటు ఏదులాపురం, మధిర, సత్తుపల్లి, వైరా, కల్లూరు మున్సిపాలిటీలు ఉన్నాయి. అయితే ప్రభుత్వం ఏదులాపురం మున్సిపాలిటీకే రూ.15 కోట్లు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కేఎంసీకి రూ.50కోట్లు కేటాయించినట్లు చెబుతున్నా ఉత్తర్వులు రాలేదు. మిగతా మున్సిపాలిటీలకు సంబంధించి కూడా ఉత్తర్వులు వెలువడలేదు. అయితే, కేఎంసీతో పాటు ఆయా మున్సిపాలిటీల నుండి మరికొన్ని పనులకు ప్రతిపాదనలు పంపిస్తే నిధుల కేటాయింపు ఉత్తర్వులు జారీ అవుతాయని, ఇదంతా రెండు, మూడు రోజుల్లో పూర్తవుతుందని మున్సిపల్‌ అధికారుల్లో చర్చ జరుగుతోంది.

పనులు నిధులు

(రూ.కోట్లలో)

విలీన ప్రాంతాల అభివృద్ధి 4

కూడళ్ల అభివృద్ధి 1

అంతర్గత రోడ్ల నిర్మాణం 4

డ్రైయినేజీల నిర్మాణం 3.25

2 బీహెచ్‌కే కాలనీలో సౌకర్యాల కల్పన 0.25

పార్కుల అభివృద్ధి 2

కల్వర్టుల నిర్మాణం 0.50

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement