ముఖగుర్తింపు హాజరులో అగ్రస్థానం
చింతకాని/రఘునాథపాలెం: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరును ఫేస్ రికగ్నైజేషన్ సిస్టమ్(ఎఫ్‌ఆర్‌సీ) ద్వారా నమోదు చేస్తుండగా జిల్లాలోని చింతకాని మండలం ముందు వరుసలో నిలిచింది. అంతేకాక రఘునాథపాలెం మండలంలోని గణేశ్వరం ఎంపీయూపీఎస్ సైతం విద్యార్థుల ముఖగుర్తింపు నమోదుతో రాష్ట్రస్థాయిలో ఉత్తమ స్థానం సాధించింది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో శనివారం జరిగిన సమావేశంలో చింతకాని ఎంఈఓ సలాది రామారావు, గణేశ్వరం పాఠశాల ప్రధానోపాధ్యాయులు కె.విజయశ్రీ అవార్డులు అందుకున్నారు. వీరికి డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ నవీన్ నికోలస్, అదనపు డైరెక్టర్ రాధారెడ్డి అవార్డులు అందజేయగా, ఎన్‌సీఈఆర్‌టీ డైరెక్టర్ రమేష్, వరంగల్ రీజినల్ డైరెక్టర్ సత్యనారాయణరెడ్డి, పాఠ్యపుస్తకాల విభాగం డైరెక్టర్ శ్రీనివాసాచారి తదితరులు పాల్గొన్నారు.
చింతకాని మండలంతో పాటు గణేశ్వరం పాఠశాలకు అవార్డులు
ముఖగుర్తింపు హాజరులో అగ్రస్థానం


