పకడ్బందీగా ఎస్‌ఐఆర్ జాబితా
ఖమ్మంసహకారనగర్: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్‌ఐఆర్) జాబితాను పకడ్బందీగా తయారు చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి సూచించారు. హైదరాబాద్ నుంచి శనివారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ 2002లో చేసిన ఎస్‌ఐఆర్ జాబితాతో ప్రస్తుత ఓటర్ జాబితా ను మ్యాపింగ్ చేయాలని తెలిపారు. ఈమేరకు అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ శనివారం నాటికి మ్యాపింగ్ పూర్తి చేస్తామని వెల్లడించారు. ఆర్‌డీఓ జి.నరసింహారావు, తహసీల్దార్లు అరుణ, శ్రీనివాసరావు, ఉద్యోగులు రాజు, అన్సారీ తదితరులు పాల్గొన్నారు.
రేక్ పాయింట్‌కు 2,518 టన్నుల యూరియా
చింతకాని: చింతకాని మండలం పందిళ్లపల్లిలోని రేక్ పాయింట్‌కు కోరమాండల్ కంపెనీకి చెందిన 2,518 టన్నుల యూరియా శనివారం చేరింది. ఇందులో ఖమ్మం జిల్లాకు 1,158 టన్నులు, భద్రాద్రి జిల్లాకు 830 టన్నులు, మహబూబాబాద్ జిల్లాకు 300 టన్నులు కేటాయించినట్లు రేక్ పాయింట్ ఇన్‌చార్జ్ పవన్‌కుమార్ తెలిపారు. మిగతా యూరియా బఫర్ స్టాక్‌గా నిల్వ చేస్తున్నట్లు వెల్లడించారు.
కలెక్టరేట్ ఎదుట
రేపు పెన్షనర్ల ధర్నా
ఖమ్మంసహకారనగర్: 2024 మార్చి నుంచి ఉద్యోగ విరమణ చేసిన ఉద్యోగులకు బకాయి ల చెల్లింపులో రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ ఈనెల 27న కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సంఘం రాష్ట్ర కార్యదర్శి వి.మేరీ ఏసుపాదం తెలి పారు. ఖమ్మంలో శనివారం పరిశ పుల్లయ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆమె ధర్నా పోస్టర్లు ఆవిష్కరించి మాట్లాడారు. జిల్లా కార్యదర్శి రాయల రవికుమార్‌తో పాటు పి.సత్యనారాయణ, కె.శరత్‌బాబు, ఊడుగు వెంకటేశ్వర్లు, జల్లా వెంకటేశ్వర్లు, బి.కృష్ణకుమారి, టి.అంజలి, కె.అన్నమ్మ, రాధాకృష్ణమూర్తి, ప్రసాదరావు పాల్గొన్నారు.
మెడిసిన్ విద్యార్థికి రూ.1.25 లక్షల ఆర్థికసాయం
కల్లూరు: తిరుమలాయపాలెం మండలం తిమ్మక్కపేటకు చుంచు వీరబాబు – మాధవి కుమార్తె భవన హైదరాబాద్ గాంధీ మెడికల్ కళాశాలలో ఉచిత సీటు సాధించింది. అయినా హాస్టల్ ఫీజు, ఇతర ఖర్చులు భరించేక నిరుపేదలైన ఆమె తల్లిదండ్రులు ఇబ్బంది పడుతుండగా, స్ఫూర్తి ఫౌండేషన్ సభ్యులు పరకా రామారావును ఆశ్రయించారు. ఆయన ఫౌండేషన్ ఛైర్మన్ శ్రీవ్యాల్‌కు వివరించడంతో దాతల సహకారంతో రూ.1.25 లక్షలు సమకూర్చారు. దీంతో చెక్కును కల్లూరులో శనివారం భవన తల్లిదండ్రులకు రామారావు అందజేశారు.
ఫీజు, స్కాలర్‌షిప్
బకాయిలు విడుదల చేయాలి
ఖమ్మం మామిళ్లగూడెం: విద్యార్థుల బోధనా రుసుములు, ఉపకార వేతనాల బకాయిలు తక్షణమే విడుదల చేయాలని ఏఐఎస్‌ఎఫ్ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఇటికాల రామకృష్ణ డిమాండ్ చేశారు. ఖమ్మంలో శనివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత నాలుగేళ్లగా ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలు విడుదల చేయడం లేదని, ప్రభుత్వం మారినా పరిస్థితుల్లో మార్పు లేదని విమర్శించారు. ఏఐఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్షుడు మడుపల్లి లక్ష్మణ్, నాయకులు షేక్ నాగుల్‌మీరా, శివ, వంశీ, గోపి, ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.
రౌడీషీటర్ల కదలికలపై పోలీసుల నిఘా
ఖమ్మంక్రైం: జిల్లాలో రౌడీషీటర్లు, హిస్టరీ షీటర్లపై పోలీసులు నిఘా పెంచారు. ఈమేరకు శుక్రవారం రాత్రి నుంచి శనివారం తెల్ల వారుజాము వరకు రికార్డుల్లో ఉన్న 225మంది ఇళ్లకు ఆకస్మికంగా వెళ్లిన పోలీసులు కదకలికలపై ఆరా తీశారు. ప్రస్తుత వృత్తి వివరాలు తెలుసుకున్నారు. ప్రతీ ఒక్కరిపై నిఘా ఉన్నందున ఏ చిన్న తప్పు చేసినా దొరిపోవడం ఖయమని తెలిపారు. తరచూ భూదందాలు, సెటిల్‌మెంట్లతో పాటు గంజాయి అమ్మకాలు చేసే వారిపై పీడీ యాక్ట్ నమోదు తప్పదని హెచ్చరించారు. ఇదే సమయాన సత్ప్రవర్తన కలిగి ఉంటే షీట్ ఎత్తివేస్తామని పోలీసులు వారికి భరోసా కల్పించారు.
పకడ్బందీగా ఎస్‌ఐఆర్ జాబితా


