టీటీడీ ఆలయ హద్దులపై సర్వే
ఖమ్మంఅర్బన్: టీటీడీ ఆధ్వర్యాన ఖమ్మం అల్లిపురంలో వేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి ప్రతిపాదించగా, ఇప్పటికే గుర్తించిన స్థలంలో శనివారం సర్వే చేశారు. తహసీల్దార్ సైదులు ఆధ్వర్యాన భూసర్వే చేపట్టి హద్దులను నిర్ధారించారు. అయితే, ఇవి అసైన్డ్ భూములు కావడంతో అందులో ఎంతమేర సాగులో ఉంది, ఎక్కడైనా చేతులు మారిందా అనే వివరాలు నమోదు చేశారు. సర్వే పూర్తయ్యాక భూముల వారీగా వివరాలతో నివేదిక సిద్ధం చేయనుండగా, ఆతర్వాత అసైన్డ్ పట్టాదారులకు ఎలాంటి సాయం చేయాలనే అంశంపై ఉన్నతాధికారులు నిర్ణయిస్తారని తెలిసింది. సర్వేలో తహసీల్దార్‌తో పాటు ఆర్‌ఐలు సత్యనారాయణ, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. మరోవైపు అల్లిపురం, కొత్తగూడెం గ్రామాల వాసులు ఆలయం నిర్మించే స్థలంలో శుభ్రపరిచి పూజలు చేశారు. పీఏసీఎస్ చైర్మన్ రావూరి సైదుబాబు, నాయకులు సంక్రాంతి నాగేశ్వరరావు, వెనిగళ్ల నాగేశ్వరరావు, పత్తిపాటి అప్పారావు, వడ్డెప్పుడు మల్లయ్య, సామినేని ముత్తయ్య, గుండె ఆదినారాయణ, ఎర్రబోయిన గోవిందు, పగడాల మల్లేశ్, జె.వెంకన్న, ఉప్పందర్ పాల్గొన్నారు.


