‘జాగృతి’ రాష్ట్ర కార్యదర్శిగా కిషన్‌నాయక్
ఖమ్మం మామిళ్లగూడెం: తెలంగాణ జాగృతి రాష్ట్ర కార్యదర్శిగా జిల్లాకు చెందిన బానోత్ కిషన్‌నాయక్ నియమితులయ్యారు. జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత రాష్ట్ర కార్యవర్గంతో అన్ని జిల్లాల అనుబంధ విభాగాల బాధ్యులను శుక్రవారం హైదరాబాద్‌లో ప్రకటించారు. ఈమేరకు రాష్ట్ర కార్యదర్శిగానే కాక ఎస్టీ విభాగం కోఆర్డినేటర్‌గా కిషన్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంస్థ కార్యకలాపాలు గ్రామస్థాయి వరకు తీసుకెళ్లేలా కృషి చేస్తానని తెలిపారు.
జమలాపురంలో పూజలు
ఎర్రుపాలెం: తెలంగాణ తిరుపతిగా పేరున్న జమలాపురంలోని శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజలు జరిగాయి. తెల్లవారుజామునే స్వామి మూలవిరాట్‌తో పాటు ఆలయ ఆవరణలోని శ్రీవారి పాదానికి అర్చకులు పంచామృతంతో అభిషేకాలు చేశారు. ఆతర్వాత స్వామి, అమ్మవార్లను అలంకరించి పెద్దసంఖ్యలో హాజరైన భక్తుల సమక్షాన నిత్యకల్యాణం, పల్లకీ సేవ నిర్వహించారు. ఆలయ ఈఓ జగన్మోహన్‌రావు, వ్యవస్థాపక దర్మకర్త ఉప్పల శ్రీరామచంద్రమూర్తి, ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాసశర్మ, ఉద్యోగులు పాల్గొన్నారు.


