
నిబద్ధతతో పనిచేస్తేనే వ్యవస్థ మనుగడ
● అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి ● జీపీఓల నుంచి ఆప్షన్ ఫామ్‌ల స్వీకరణ
ఖమ్మంసహకారనగర్: ప్రభుత్వఽ ఉద్యోగులు నిబద్ధతతో పనిచేస్తేనే వ్యవస్థ మనుగడ సాధ్యమవుతుందని అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇటీవల నిర్వహించిన పరీక్షలో ఉత్తీర్ణత సాధించి గ్రామ పాలన అధికారులు(జీపీఓ)లుగా ఎంపికై న వారి నుంచి కలెక్టరేట్‌లో గురువారం సమావేశమైన ఆయన ఆప్షన్ ఫారాలు స్వీకరించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ జిల్లాలోని 299 క్లస్టర్లలో రెవెన్యూ పరిపాలన పటిష్టతకు గ్రామపాలన అధికారులను నియమిస్తున్నట్లు తెలిపారు. పరీక్షలో 253 మంది ఉత్తీర్ణత సాధించగా, వీరిలో 240 మంది స్థానికులు, 13 మంది స్థానికేతరులు ఉన్నారని తెలిపారు. ఈ నియామకంతో మూడేళ్ల తర్వాత వీఆర్‌ఓలు, వీఆర్‌ఏలు రెవెన్యూ శాఖలోకి వస్తున్నారని చెప్పారు. ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేలా శిక్షణ కూడా ఇస్తామని అన్నారు. కాగా, శుక్రవారం సీఎం చేతుల మీదుగా నియామక పత్రాలు తీసుకోనుండగా 15 రోజుల్లో విధులలో చేరాలని అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి సూచించారు. జిల్లా కేంద్రం నుంచి హైదరాబాద్‌కు తీసుకెళ్లేలా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. అనంతరం అదనపు కలెక్టర్, డీఆర్‌ఓ ఏ.పద్మశ్రీతో కలిసి జీపీఓలు కేక్ కట్ చేశారు. ఈ సమావేశంలో కలెక్టరేట్ ఏఓ కె.శ్రీనివాసరావు, రెవెన్యూ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు సునీల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
●గ్రామపాలన అధికారులు(జీపీఓ)లుగా శుక్రవా రం నియామకపత్రాలు అందుకోనున్న పూర్వ వీఆర్వోలు ఆప్షన్లు ఇచ్చారు. పెద్దసంఖ్యలో వచ్చిన వీరితో కలెక్టరేట్ సందడిగా కనిపించింది.