ఓయూ నుంచి డాక్టరేట్‌ | - | Sakshi
Sakshi News home page

ఓయూ నుంచి డాక్టరేట్‌

Aug 9 2025 5:56 AM | Updated on Aug 9 2025 5:56 AM

ఓయూ న

ఓయూ నుంచి డాక్టరేట్‌

కల్లూరు: కల్లూరు మున్సిపాలిటీ పరిధి శాంతినగర్‌కు చెందిన కొత్తపల్లి మందాకినికి ఉస్మానియా యూని వర్సిటీ నుంచి డాక్టరేట్‌ లభించింది. కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్‌ విభాగంలో ప్రొఫెసర్‌ కె.శ్యామల పర్యవేక్షణలో ఆమె సమర్పించిన పరిశోధనా త్మక సిద్ధాంత గ్రంధానికి డాక్టరేట్‌ ప్రకటించా రు. మందాకిని తండ్రి గోపాలరావు ఆర్‌టీసీ రిటైర్డ్‌ డ్రైవర్‌కాగా, భర్త అన్వేష్‌ ములుగు జిల్లాలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు.

నేడు మంత్రి

పొంగులేటి పర్యటన

ఖమ్మంమయూరిసెంటర్‌: రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శనివారం ఉమ్మడి జిల్లాలో పర్యటించనున్నారు. ఖమ్మం జిల్లాలోని ఏదులాపురం మున్సిపాలిటీతో పాటు రఘునాథపాలెం, వైరా, బోనకల్‌ మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని దమ్మపేట, పాల్వంచ, లక్ష్మీదేవిపల్లి, చుంచుపల్లి మండలాల్లోని పలు ప్రైవేట్‌ కార్యక్రమాల్లో మంత్రి పాల్గొననున్నారు.

కాంగ్రెస్‌ మాజీ ఇన్‌చార్జిని కలిసిన మంత్రి

ఖమ్మంఅర్బన్‌: కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల మాజీ ఇన్‌చార్జి మాణిక్‌రావు ఠాక్రేను రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కలిశారు. హైదరాబాద్‌లో శుక్రవారం ఆయనను కలిసిన మంత్రి రాష్ట్రంలో వ్యవసాయ రంగం, పార్టీ వ్యవహారాలు తదితర అంశాలపై చర్చించారు.

గణపతి ఉత్సవాల్లో

మట్టి విగ్రహాలకు ప్రాధాన్యత

ఖమ్మంగాంధీచౌక్‌: సంస్కృతి, సంప్రదాయాలు పాటిస్తూ పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా వినాయక నవరాత్రోత్సవాలు నిర్వహించాలని ఖమ్మం స్తంభాద్రి ఉత్సవ కమిటీ నిర్ణయించింది. కమిటీ అధ్యక్షుడు వినోద్‌ లాహోటి అధ్యక్షతన శుక్రవారం జరిగిన సమావేశంలో ఉత్సవా లపై నిర్వహణపై చర్చించారు. ఈనెల 27వ తేదీ బుధవారం గణేష్‌ఉత్సవాలను ప్రారంభించి,సెప్టెంబర్‌6న ప్రతిమలనునిమజ్జనం చేయా లని నిర్ణయించారు. ఈసారి మట్టి విగ్రహాలతో ఉత్సవాలను జరుపుకునేలా మండప నిర్వాహకులకు అవగాహన కల్పించాలని తెలిపారు. ఉత్సవాలు వైభవంగా జరిగేలా సహకారం కోసం కలెక్టర్‌, పోలీస్‌ కమిషనర్‌ను కలవాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో కమిటీ ప్రధా న కార్యదర్శి కీసర జయపాల్‌రెడ్డితో పాటు గెంటేల విద్యాసాగర్‌, వేల్పుల సుధాకర్‌, అల్లిక అంజయ్య, ఈశ్వరప్రగఢ రామారావు, హరి, పిల్లలమర్రి వెంకట్‌ తదితరులు పాల్గొన్నారు.

ఐజేయు జాతీయ కౌన్సిల్‌ సభ్యుల ఏకగ్రీవం

ఖమ్మం సహకారనగర్‌: ఇండియన్‌ జర్నలిస్ట్‌ యూనియన్‌(ఐజేయూ) జాతీయ కౌన్సిల్‌ సభ్యులుగా ఇద్దరిని ఎన్నుకున్నారు. ఖమ్మం జెడ్పీ హాల్‌లో జరిగిన సమావేశంలో టీయూడబ్ల్యూజే(ఐజే యూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.రాంనారాయణ, సీనియర్‌ నాయకుడు నలజాల వెంకట్రావు మాత్రమే ఇద్దరే నామినేషన్లు దాఖలు చేయడంతో ఎన్నికఏకగ్రీవమైంది. అనంతరం వీరిని యూ నియన్‌ నాయకులు సన్మానించారు. యూనియన్‌ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఏనుగు వెంకటేశ్వరరావు, మైసా పాపారావుతో పాటు నాయకులు మాటేటి వేణుగోపాల్‌, వనం వెంకటేశ్వర్లు, శివ, మామిడాల భూపాల్‌, పసునూరి మహేందర్‌, కనకం సైదులు, అన్నంచిన్ని వెంకట రామారావు, నెల్లూరి ఉపేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

పాత సంతకాలతో నోటరీలు?

ఖమ్మంక్రైం: ఖమ్మం మున్సిపల్‌ కార్పొరేషన్‌ కార్యాలయం సమీపాన ఓ మహిళ నిర్వహిస్తున్న జిరాక్స్‌, ఆన్‌లైన్‌ సెంటర్‌లో శుక్రవారం రాత్రి టూటౌన్‌, టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు తనిఖీ చేపట్టారు. ఆమె వద్దకు నోటరీ కోసం వచ్చే వారిని విచారించకుండానే పాత సంతకాలతో కూడిన పత్రాలు విక్రయిస్తుందనే ఫిర్యాదులు అందాయని సమాచారం. దీంతో తనిఖీ చేపట్టి 36 నోటరీలను స్వాధీనం చేసుకున్నామని సీఐ బాలకృష్ణ తెలిపారు.

ఓయూ నుంచి డాక్టరేట్‌1
1/3

ఓయూ నుంచి డాక్టరేట్‌

ఓయూ నుంచి డాక్టరేట్‌2
2/3

ఓయూ నుంచి డాక్టరేట్‌

ఓయూ నుంచి డాక్టరేట్‌3
3/3

ఓయూ నుంచి డాక్టరేట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement