
వైరల్ ఫీవర్‌తో రైతు మృతి
రఘునాథపాలెం: రఘునాథపాలెం మండలం ఈర్లపూడికి చెందిన రైతు పున్నపోల వెంకటేశ్వర్లు(49) వైరల్ ఫీవర్‌తో చికిత్సపొందుతూ శుక్రవారం మృతిచెందాడు. ఆయన నాలు గు రోజుల క్రితం జ్వరం బారిన పడగా ఖమ్మంలో చికిత్స అనంతరం హైదరాబాద్ తరలించారు. అక్కడ చికిత్స చేయిస్తుండగానే వెంకటేశ్వర్లు మృతి చెందాడు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.
డెంగీ లక్షణాలతో మహిళ ..
కొణిజర్ల: డెంగీ లక్షణాలతో బాధపడుతున్న ఓ మహిళ మండలంలోని తనికెళ్లలో శుక్రవారం మృతి చెందింది. గ్రామానికి చెందిన కూచుపూడి హరిత(35) జ్వరం బారి న పడగా ఖమ్మంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. అయి తే, ప్లేట్‌లెట్ల సంఖ్య క్షీణించడంతో హైదరాబాద్ తరలించగా చికిత్స పొందుతూ శక్రవారం మృతి చెందింది. కాగా, హరిత డెంగీతోనే మృతి చెందిందని ఆమె కుటుంబీకులు చెప్పగా.. పెద్దగోపతి పీహెచ్‌సీ వైద్యాఽధికారి రాధాకృష్ణ మాత్రం డెంగీ పరీక్షలో నెగిటివ్‌గా వచ్చిందని తెలిపారు. గ్రామంలో పారిశుద్ధ్య లోపంతో దోమల పెరిగి జ్వరాలు వ్యాపిస్తున్నందున అధికారులు స్పందించాలని స్థానికులు కోరారు.
ఆర్టీసీ బస్సులో ఛత్తీస్‌గఢ్ వాసి..
వైరా: అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్‌లో చికిత్స చేయించుకుని వస్తున్న ఛత్తీస్‌గఢ్‌వాసి ఆర్టీసీ బస్సులోనే మృతిచెందాడు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా గుడారా గ్రామానికి చెందిన దేవ శిపా అనారోగ్యంతో బాధపడుతుండగా రెండు రోజుల క్రితం హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స అనంతరం శుక్రవారం ఆర్టీసీ బస్సులో భద్రాచలం బయలుదేరగా వైరా వద్దకు వచ్చే సరికి మృతి చెందాడు. దీంతో డ్రైవర్ స్టేషన్ మాస్టర్ సాయంతో వైరా పోలీసులకు సమాచారం ఇవ్వగా ట్రెయినీ ఎస్‌ఐ పవన్ పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
ఆటోడ్రైవర్ అదృశ్యంపై కేసు
ఖమ్మంఅర్బన్: ఖమ్మం వైఎస్సార్ నగర్‌కు చెందిన ఆటో డ్రైవర్ జానీ కానరాకుండా పోవడంపై కేసు నమోదైంది. కొద్దిరోజుల క్రితం బయటకు వెళ్లిన ఆయన తిరిగి రాకపోవడంతో కుటుంబీకులు గాలించినా ఫలితం కానరాలేదు. దీంతో జానీ కుటుంబ సభ్యులు శుక్రవారం ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశామని ఖమ్మం అర్బన్ సీఐ భానుప్రకాష్ తెలిపారు.

వైరల్ ఫీవర్‌తో రైతు మృతి