
సీహెచ్‌పీలో సింగరేణి ఈడీ తనిఖీ
సత్తుపల్లి: సత్తుపల్లిలోని జేవీఆర్ ఓసీ కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్‌ను శుక్రవారం సింగరేణి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్(కోల్ మూవ్‌మెంట్), చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ బి.వెంకన్న తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఓసీల్లో బొగ్గు ఉత్పత్తి, సీహెచ్‌పీ ద్వారా రవాణాపై ఆరా తీశారు. అనంతరం జీఎం కార్యాలయంలో సింగరేణి, రైల్వే అధికారులతో ఈడీ సమావేశమయ్యారు. సైలో బంకర్ నుంచి దుమ్ము, ధూళి వెలువడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, రోజువారీ లక్ష్యాలను అనుగుణంగా బొగ్గు ఉత్పత్తి, రవాణా చేయాలని సూచించారు. అనంతరం ఓసీల డంప్ యార్డ్‌లపై ఈడీ మొక్కలు నాటారు. కొత్తగూడెం ఏరియా జీఎం షాలేంరాజు, ఉద్యోగులు కోటిరెడ్డి, సూర్యనారాయణరాజు, ప్రహ్లాద్, నర్సింహారావు, సోమశేఖర్‌రావు, మదన్‌మోహన్, తౌర్య, రవికుమార్, ఏ.రాజేంద్రబాబు, కేవై.పాషా పాల్గొన్నారు.
ఉమ్మడి జిల్లాకు 3వేల మెట్రిక్ టన్నుల యూరియా
ఖమ్మంవ్యవసాయం/చింతకాని: ఉమ్మడి ఖమ్మం జిల్లా అవసరాల కోసం 3,001 మెట్రిక్ టన్నుల క్రిబ్‌కో యూరియా సరఫరా అయింది. ఖమ్మం జిల్లా పందిళ్లపల్లి రైల్వే రేక్ పాయింట్‌కు యూరియా చేరగా.. ఖమ్మం జిల్లాకు 1,501, భద్రాద్రి జిల్లాకు 1,400 మెట్రిక్ టన్నులు సరఫరా చేశారు. మిగిలిన 100మెట్రిక్ టన్నులను బఫర్ స్టాక్‌గా నిల్వ చేశారు. జిల్లాల వారీగా కేటాయించిన యూరియాను పీఏసీఎస్‌లు, ఆగ్రో రైతు సేవా కేంద్రాలు, ప్రైవేట్ డీలర్ల ద్వారా విక్రయిస్తారు. కాగా, పందిళ్లపల్లిలో యూరియా పంపిణీని ఖమ్మం డీఏఓ డి.పుల్లయ్య పర్యవేక్షించారు.
జిల్లాలో ఓ మోస్తరు వాన
ఖమ్మంవ్యవసాయం: జిల్లా వ్యాప్తంగా గురువారం, శుక్రవారం ఓ మోస్తరు వర్షం కురిసింది. గురువారం ఉదయం 8–30 నుంచి శుక్రవారం ఉదయం 8–30 గంటల వరకు జిల్లాలో సగటున 19.9 మి.మీ.ల వర్షపాతం నమోదైందని అధికారులు వెల్లడించారు. అత్యధికంగా వేంసూరు మండలంలో 74.4 మి.మీ. వర్షపాతం నమోదుకాగా, ఎర్రుపాలెంలో 52.2, నేలకొండపల్లిలో 50.2, బోనకల్‌లో 47.8, మధిరలో 46.2, వైరాలో 22.4, సత్తుపల్లిలో 21.8, చింతకానిలో 14.8, తల్లాడలో 10.4, పెనుబల్లిలో 10.2, సింగరేణిలో 10 మి.మీ., మిగిలిన మండలాల్లో 10 మి.మీ.ల లోపు వర్షపాతం నమోదైందని తెలిపారు. కొద్ది రోజులుగా ఉష్ణోగ్రతలు పెరగగా, ప్రస్తుతం వర్షంతో పత్తి తదితర మెట్ట పంటలకే కాక వరి పంటకు ప్రయోజనం కలగనుంది.
ట్యాంక్ బండ్లుగా
అభివృద్ధికి రూ.30కోట్లు
ఖమ్మం రాపర్తినగర్: మధిర నియోజకవర్గంలోని పలువురు చెరువులను ట్యాంకు బండ్లుగా అభిృవృద్ధి చేసేందుకు ప్రభుత్వం రూ.30.60కోట్ల నిధులు కేటాయించింది. ఈమేరకు రాష్ట్ర పర్యాటక శాఖ అధికారులు శుక్రవారం ఆయా చెరువులను పరిశీలించి అభివృద్ధి ప్రతిపాదనలపై సమీక్షించారు. ముత్తారం చెరువును రూ.8.95కోట్లు, చింతకాని చెరువును రూ.7.90కోట్లు, కలకోట చెరువును రూ.7.05కోట్లు, చిరుమర్రి, బయ్యారం చెరువులను రూ.2.90కోట్ల చొప్పున నిధులతో పాటు మాటూరు చెరువుకు రూ.90లక్షలతో ట్యాంక్ బండ్లుగా అభివృద్ధి చేయనున్నట్లు వెల్లడించారు. ఈ పరిశీలనలో రాష్ట్ర పర్యాటక శాఖ అధికారులు ఉపేందర్‌రెడ్డి, సరిత, జిల్లా పర్యాటక శాఖ అధికారి సుమన్‌చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.

సీహెచ్‌పీలో సింగరేణి ఈడీ తనిఖీ

సీహెచ్‌పీలో సింగరేణి ఈడీ తనిఖీ