
అంగన్‌వాడీ కేంద్రాలకు ఆరోగ్య కిట్లు
నేలకొండపల్లి: అంగన్‌వాడీ కేంద్రాల్లోని చిన్నారుల ఆరోగ్యంపై ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. కేంద్రాల్లో ఆటపాటల ద్వారా పూర్వ ప్రాథమిక విద్య అందిస్తూనే పౌష్టికాహారం సమకూరుస్తున్నారు. ప్రసుత్తం వర్షాకాలం కావడంతో చిన్నారులు వ్యాధుల బారిన పడే అవకాశముండడం.. ఆడుతూ కింద పడితే గాయపడే ప్రమాదమున్నందున ప్రథమ చికిత్స కోసం ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రాలకు ఆరోగ్య కిట్లు పంపిణీ చేసింది. జిల్లాలోని 1,840 అంగన్‌వాడీ కేంద్రాల్లో 67,198 మంది చిన్నారులు ఉండగా.. అనుకోకుండా స్వల్ప గాయాలైనా, జ్వరం బారిన పడిన చికిత్స చేసేలా ఈ కిట్లలో మందులు అందించారు. ఇందులో హైడ్రోజన్ పెరాకై ్సడ్, దూది, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు, దురద నివారణ, చెవినొప్పి మందులు, జ్వరం, దగ్గు, జలుబు నివారణ టానిక్‌లు ఉన్నాయి. ఈ విషయమై జిల్లా సీ్త్ర, శిశు సంక్షేమాధికారి రాంగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ జిల్లాలోని అన్ని అంగన్‌వాడీ కేంద్రాలకు మెడికల్ కిట్ల సరఫరా పూర్తికావొచ్చిందని తెలిపారు. అయితే, అందులోని మందులను వైద్య సిబ్బంది సూచనలతో ఉపయోగించాలని టీచర్లు, ఆయాలకు స్పష్టం చేశామని వెల్లడించారు.

అంగన్‌వాడీ కేంద్రాలకు ఆరోగ్య కిట్లు