జేవీఆర్ డిగ్రీ కళాశాల అభివృద్ధికి చర్యలు
సత్తుపల్లి: సత్తుపల్లి జేవీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నూతన షెడ్ల నిర్మాణంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలకు చర్యలు తీసుకుంటామని పూర్వ విద్యార్థి సంఘం బాధ్యుడు మట్టా దయానంద్ అన్నారు. శనివారం కళాశాలను సందర్శించి కళాశాల మైదానంలోని క్రీడాకారులతో మాట్లాడారు. ఇండోర్, అవుట్‌డోర్ గేమ్స్ ఏర్పాటు చేస్తామన్నారు. వాకర్స్‌కు ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్.గోపి, దొడ్డా శ్రీనివాసరావు, ఇమ్మినేని ప్రసాద్, వెంకటరమణ, దిలీప్, జె.వంశీ, ఇర్ఫాన్ పాల్గొన్నారు.


