
సీహెచ్‌సీలో కాయకల్ప బృందం
తిరుమలాయపాలెం: తిరుమలాయపాలెంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ను కాయకల్ప బృందం సభ్యులు శనివారం సందర్శించారు. మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు బృందం పరిశీలన కొనసాగగా ఆస్పత్రిలో పరిశుభ్రత, ఓపీ రూమ్‌ల నిర్వహణపై డాక్టర్ బాలకృష్ణ, సిబ్బంది ఇందిర, విమల వివరాలు తెలుసుకున్నారు. రోజువారీ ఓపీ నమోదు, ఆపరేషన్ థియేటర్, ఓపీ గదుల నిర్వహణ, మందుల లభ్యతపైనా ఆరా తీసిన వారు చికిత్స కోసం వచ్చిన వారితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో సీహెచ్‌సీ ఇన్‌చార్జి సూపరింటెండెంట్ డాక్టర్ అమర్‌సింగ్ తదితరులు పాల్గొన్నారు.