అన్నయ్యలతో కలిసి పాఠశాలకు.. | - | Sakshi
Sakshi News home page

అన్నయ్యలతో కలిసి పాఠశాలకు..

Jun 12 2025 3:23 AM | Updated on Jun 12 2025 3:43 AM

ఖమ్మంమయూరిసెంటర్‌: నేను 1–5వ తరగతి వరకు స్వస్థలమైన వైరా మండలం కొండకొడిమ పీఎస్‌లో, 6–10వ తరగతి వరకు మా నాన్న సూర్యనారాయణ ఉపాధ్యాయుడిగా పని చేసిన రెబ్బవరం జెడ్పీహెచ్‌ఎస్‌లో పూర్తిచేశా. ఇద్దరు అన్నయ్యలతో కలిసి స్కూల్‌కు వెళ్లేవాడిని. వేసవి సెలవులు వచ్చాయంటే ఇంటి వద్ద పొలం పనులకు వెళ్లేవాడిని. సెలవుల్లో ఎంత సరదాగా గడిపినా.. పాఠశాల పునఃప్రారంభం రోజునే వెళ్లేలా అమ్మ ప్రోత్సహించేది. సెలవుల్లో ఏమేం చేశామో తొలి రోజు స్నేహితులు, టీచర్లతో చెప్పేవాళ్లం. మా అన్నయ్యలు నాగ కోటేశ్వరరావు, వెంకటేశ్వరరావుతో కలిసి స్కూల్‌కు వెళ్లిన రోజులు గుర్తుకొస్తుంటాయి.

– కె.సత్యనారాయణ, ఎస్సీ డీడీ

అన్నయ్యలతో కలిసి పాఠశాలకు..
1
1/1

అన్నయ్యలతో కలిసి పాఠశాలకు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement