‘బడిబాట’ పూర్తయ్యాక సర్దుబాటు చేయాలి
ఖమ్మంసహకారనగర్: జిల్లాలో బడిబాట కార్యక్రమం పూర్తయ్యాకే ఉపాధ్యాయుల సర్దుబాటు చేపట్టాలని పీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షులు యలమద్ది వెంకటేశ్వర్లు కోరారు. ఈ మేరకు శనివారం డీఈఓ సత్యనారాయణకు వినతిపత్రం అందజేసి మాట్లాడారు. ప్రభుత్వపాఠశాలలు బలోపేతం చేసే లా సర్దుబాటు ఉత్తర్వులు ఉండాలన్నారు. అంతే తప్ప అసంబద్ధమైన రేషనలైజేషన్ నిబంధనలు పాటించాలనడం సరికాదని పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయకులు విజయ, అమృత్‌కుమార్, రాయల నరసింహారావు, గిలకత్తుల వెంకటరమ ణ, జిల్లా ఉపాధ్యక్షులు లింగం సతీశ్ పాల్గొన్నారు
సర్దుబాటు జీఓను సవరించాలి
ఉపాధ్యాయులను సర్దుబాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీఓ 25లో లోపాలు ఉన్నందున సవరించాలని టీపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎస్.విజయ్ కోరారు. ఖమ్మంలోని సంఘం కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రాథమిక పాఠశాలల్లో ఉపాధ్యాయులు – విద్యార్థుల నిష్పత్తి సరిగా లేదని, ఇకనైనా ప్రతీ 20 మంది విద్యార్థులకు ఒక టీచర్ ఉండేలా చూడాలన్నారు. సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి వెంగళరావు, నాయకులు వెంకటేశ్వరరావు, ఉమాదేవి, కోటేశ్వరరావు, గరికే శ్రీను, నాగిరెడ్డి, యాకూబ్ పాషా, తదితరులు పాల్గొన్నారు.


