బీజేపీది గాడ్సే వారసత్వం
ఖమ్మంమయూరిసెంటర్ : బీజేపీది గాంధీని చంపిన గాడ్సే వారసత్వమని డీసీసీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ గౌడ్ అన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలు, ఉపాధి హామీ పథకం పేరు మార్పునకు నిరసనగా ఏఐసీసీ, టీపీసీసీ పిలుపు మేరకు ఆదివారం ఖమ్మం గాంధీచౌక్‌లో మహాత్మా గాంధీ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదరికాన్ని నిర్మూలించాల్సిన ప్రభుత్వం పెంచి పోషిస్తుందని ఆరోపించారు. ఆనాడు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రతీ పేదవాడికి ఉపాధి కల్పించేందుకు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని రూపొందించిందని, ఇప్పుడు ఆ పథకానికి తూట్లు పొడుస్తున్న బీజేపీ ప్రభుత్వం ఏకంగా పేరు మార్చిందని అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు నాగండ్ల దీపక్‌చౌదరి, మార్కెట్ చైర్మన్ యరగర్ల హనుమంతరావు, నాయకులు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, పోట్ల నాగేశ్వరరావు, బాలసాని లక్ష్మీనారాయణ, యర్రం బాలగంగాధర్ తిలక్, వడ్డెబోయిన నరసింహరావు, పులిపాటి వెంకయ్య, దొబ్బల సౌజన్య, వేజండ్ల సాయికుమార్, సయ్యద్ గౌస్, పుచ్చకాయల వీరభద్రం, మొక్క శేఖర్‌గౌడ్, కార్పొరేటర్లు మలీదు వెంకటేశ్వరరావు, దుద్దుకూరి వెంకటేశ్వరరావు, లకావత్ సైదులు, గజ్జల లక్ష్మి వెంకన్న పాల్గొన్నారు.


