అపజయాలే విజయాలకు సోపానం
ఖమ్మంసహకారనగర్ : అపజయాలను విజయాలకు సోపానాలుగా మలుచుకుని విద్యార్థులు ముందుకుసాగాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. నగరంలోని ఎస్‌ఎఫ్‌ఎస్ పాఠశాలలో నిర్వహిస్తున్న జిల్లా స్థాయి సైన్స్‌ఫేర్ ముగింపు కార్యక్రమానికి ఆదివారం ఆయన హాజరై మాట్లాడారు. సైన్స్‌ఫేర్‌కు 743, ఇన్‌స్పైర్‌కు 100 ప్రదర్శనలు వచ్చాయని, ఆర్టిిఫీషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్ అంశంపై 45 మంది విద్యార్థులు ప్రదర్శనలు చేయడం అభినందనీయమని అన్నారు. పిల్లలు తమ దైనందిన జీవితంలో ఎదురయ్యే సమస్యలకు పరిష్కారం దిశగా ఆవిష్కరణలు ఉండాలని సూచించారు. వైరా ఎమ్మెల్యే రాందాస్‌నాయక్ ప్రదర్శనలను తిలకించి విద్యార్థులతో ముచ్చటించారు.
రాష్ట్రస్థాయికి 14 ప్రదర్శనలు..
జిల్లా స్థాయి సైన్స్‌ఫేర్‌లో ఏడు థీమ్‌లు ఉండగా అందులో సీనియర్, జూనియర్ విభాగాల నుంచి ఒక్కో అంశం చొప్పున మొత్తం 14 ప్రదర్శనలను రాష్ట్రస్థాయికి ఎంపిక చేశారు. అలాగే సదస్సు, ఒక టీచర్ ప్రదర్శన కూడా రాష్ట్రస్థాయికి ఎంపికయ్యాయి. వీరందరికీ కలెక్టర్ అనుదీప్ ప్రశంసాపత్రాలు అందించారు. డీఈఓ చైతన్య జైనీ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సెక్టోరియల్ అధికారులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ప్రైవేటు విద్యాసంస్థల బాధ్యులు పాల్గొన్నారు. ప్రైవేటు విద్యాసంస్థల ఆధ్వర్యంలో విద్యార్థులకు భోజన, అల్పాహారం అందజేశారు.
సైన్స్‌ఫేర్ ముగింపు సభలో కలెక్టర్ అనుదీప్


