ప్రజల విశ్వాసాన్ని చూరగొనాలి
ఖమ్మంమయూరిసెంటర్: గ్రామాల్లో నూతనంగా గెలిచిన సర్పంచ్‌లు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు ప్రజా సమస్యలు పరి ష్కరించి, ప్రజల విశ్వాసాన్ని చూరగొనాలని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యు డు తమ్మినేని వీరభద్రం సూచించారు. ఆదివారం ఖమ్మం సుందరయ్య భవనంలో నూతనంగా ఎన్నికై న సీపీఎం ప్రజాప్రతినిధులను సన్మానించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామాలకు విడుదల చేయాల్సిన నిధుల విషయంలో రాజీలేని పోరాటాలు నిర్వహించి గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. ఏకగ్రీవాల పేరుతో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న తరుణంలో సీపీఎం పోటీలో నిలబడ్డ వారికి ప్రజలు మద్దతుగా నిలిచి గెలిపించారని, వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా హక్కులను కాపాడాలన్నారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు పోతి నేని సుదర్శన్‌రావు మాట్లాడుతూ.. ప్రజా సమస్యలపై అంకితభావంతో పని చేసి ప్రజాభిమానం పొందాలని సూచించారు. ఈ సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, రాష్ట్ర కమిటీ సభ్యుడు బండిరమేష్, కళ్యాణ వెంకటేశ్వరరావు, వై. విక్రమ్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బొంతు రాంబాబు, భూక్య వీరభద్రం, రమేష్, ఎర్ర శ్రీనివాసరావు పాల్గొన్నారు.


