30 అడుగుల బ్రిడ్జి.. కింద చెత్త | - | Sakshi
Sakshi News home page

30 అడుగుల బ్రిడ్జి.. కింద చెత్త

May 31 2025 12:26 AM | Updated on May 31 2025 12:26 AM

30 అడ

30 అడుగుల బ్రిడ్జి.. కింద చెత్త

లారీ ఢీకొనడంతో కింద పడిన కారు

ఆపై టన్నుల కొద్దీ ఇనుపచువ్వల కట్టలు

క్షణాల్లో కిందకు దిగడంతో ఐదుగురికి తప్పిన ముప్పు

ఇక్కడ మొదటి ఫొటోలో వేలాడుతున్న లారీలో టన్నుల కొద్ది 20 ఎం.ఎం. ఇనుప చువ్వల లోడ్‌ ఉంది. ఈ లారీ శుక్రవారం వైరా వైపు నుంచి తల్లాడ వైపునకు వెళ్తోంది. వైరా మండలం స్టేజీ పినపాక వద్ద హైలెవల్‌ వంతెనపైకి చేరుకుంటుండగానే తల్లాడ వైపు నుంచి కొబ్బరి బొండాల లోడ్‌తో వైరా వైపు వస్తున్న డీసీఎం వ్యాన్‌ను అదుపు తప్పి అతివేగంగా ఢీకొట్టింది. అయితే, వ్యాన్‌ డ్రైవర్‌ అప్రమత్తతతో వంతెన రెయిలింగ్‌ను తాకి నదిలో పడకుండా (రెండో ఫొటో) ఆగిపోయింది.

కారును సైతం..

వ్యాన్‌ను ఢీకొట్టాక లారీ అంతే వేగంగా వెళ్లి ఏపీలోని విసన్నపేట మండలం తెల్దారుపల్లి నుండి వైరా మండలం రెబ్బవరం వస్తున్న కారును సైతం ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు వంతెన పైనుంచి సుమారు 30అడుగుల లోతులో వైరా నదిలో పడింది. అదృష్టవశాత్తు ఆ ప్రాంతంలో నీళ్లు లేకపోగా.. మున్సిపాలిటీ కార్మికులు డంప్‌ చేసిన చెత్త కుప్పలపై కారు పడడంతో అందులో ఉన్న మొగిలిశెట్టి కోటేశ్వరరావు కాలు విరిగింది. ఆయన కుమారుడు రాజశేఖర్‌, కోడలు గీత, మనవడు తేజస్‌, మనవరాలు జ్యోతి సురక్షితంగా బయటపడ్డారు.

క్షణాల్లోనే మరో ముప్పు

కోటేశ్వరరావు కుటుంబీకులు ప్రమాదం నుంచి తేరుకుని కిందకు దిగగానే.. అంతసేపు బ్రిడ్జి పైనుంచి వేలాడుతున్న లారీ కొద్దికొద్దిగా కిందకు జారుతూ కారు పక్కనే పడింది. ఈ సమయాన లారీలోని టన్నుల కొద్ది ఇనుప చువ్వల కట్టలు కారుపై పడడంతో గుర్తుపట్టలేనంత నుజ్జు నుజ్జయింది. అంతకు క్షణాల ముందే కోటేశ్వరరావు కుటుంబీకులు కిందకు దిగి కొంచెం దూరానికి చేరడంతో ఇదంతా కళ్లారా చూస్తూ తాము ఎంత ప్రమాదం నుంచి బయటపడ్డామో ఊహించుకుంటూ షాక్‌కు గురయ్యారు.

లారీ డ్రైవర్‌కు తీవ్రగాయాలు

ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్‌ ఏపీలోని తిరువూరుకు చెందిన షేక్‌ మున్నా తీవ్ర గాయాలతో క్యాబిన్‌లో ఇరుక్కుపోయాడు. దీంతో పోలీసులు ఆయనను బయటకు తీసి 108 వాహనంలో ఖమ్మంలోని ప్రభుత్వాస్పతికి తరలించారు. ఈ ఘటనతో వైరా– తల్లాడ జాతీయ ప్రధాన రహదారిపై ఇరువైపులా కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ స్తంభించింది. దీంతో ఎస్సై పుష్పాల రామారావు ఆధ్వర్యాన సిబ్బంది చేరుకుని వంతెనపై ఆగిన డీసీఎం వ్యాన్‌ను జేసీబీతో పక్కకు తీయించి రాకపోకలు క్రమబద్ధీకరించారు. కాగా, ప్రమాదం నుంచి బయటపడిన గీత స్వగ్రామం రెబ్బవరం కాగా, అత్తగారిల్లయిన ఏపీలోని విసన్నపేట నుంచి వస్తుండగా ఈ ప్రమాదం జరగడం.. అంతా ముప్పు నుంచి బయటపడడంతో ఘటనాస్థలిలో పిల్లలతో కూర్చున్న ఆమె షాక్‌తో కనిపించింది.

– వైరారూరల్‌

1

2

30 అడుగుల బ్రిడ్జి.. కింద చెత్త1
1/4

30 అడుగుల బ్రిడ్జి.. కింద చెత్త

30 అడుగుల బ్రిడ్జి.. కింద చెత్త2
2/4

30 అడుగుల బ్రిడ్జి.. కింద చెత్త

30 అడుగుల బ్రిడ్జి.. కింద చెత్త3
3/4

30 అడుగుల బ్రిడ్జి.. కింద చెత్త

30 అడుగుల బ్రిడ్జి.. కింద చెత్త4
4/4

30 అడుగుల బ్రిడ్జి.. కింద చెత్త

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement