
ఇంతింతై.. ఎదిగేలా...
● ఎస్‌హెచ్‌జీల సభ్యులకు సీ్త్ర టీ స్టాళ్లు, ఇతర యూనిట్లు ● ఇందిరా మహిళా శక్తి ద్వారా రుణసౌకర్యం ● లాభాల బాట పట్టడంతో సభ్యుల్లో ఆనందం
కారేపల్లి: మహిళా సంఘా(ఎస్‌హెచ్‌జీ)ల్లోని సభ్యుల ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి పథకాన్ని అమలుచేస్తోంది. ‘మహిళల ఉన్నతి–తెలంగాణ ప్రగతి’ అనే నినాదంతో మహిళలను వ్యాపార, పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలనేది లక్ష్యంగా చెబుతున్నారు. ఇందులో భాగంగా సీ్త్ర నిధి ఏర్పాటు, బ్యాంకులతో అనుసంధానం ద్వారా గ్రామ సమాఖ్య సభ్యులకు రుణ సౌకర్యం కల్పించడమే కాక సభ్యులకు ఆసక్తి ఉన్న రంగాల్లో వృత్తి నైపుణ్య శిక్షణ ఇప్పిస్తున్నారు. ఆపై వ్యాపారాలు ఏర్పాటుచేయిస్తుండగా మహిళల శ్రద్ధతో అవి లాభాల పడుతున్నాయి. కారేపల్లి మండలంలో ఐకేపీ, సింగరేణి విజేత మండల సమాఖ్య ఆధ్వర్యాన రూ.1.35లక్షల చొప్పున రెండు సీ్త్ర టీ స్టాల్ యూనిట్లు, రూ. 1.39లక్షలతో నాటు కోడిపిల్లల యూనిట్ మంజూరు చేసింది. కారేపల్లిలోని మండల పరిషత్ కార్యాలయాల ప్రాంగణంలో మొగరంపల్లి శ్రీలత, పోలీసు స్టేషన్ సర్కిల్‌లో కంచి నాగలక్ష్మి టీ స్టాళ్లు ఏర్పాటుచేయగా, తొడితలగూడెంలో బండారి రత్తమ్మకు నాటు కోడిపిల్లల పెంపకం యూనిట్ మంజూరైంది. ఇవి కాక జిల్లాలోని పలుచోట్ల ఏర్పాటైన సీ్త్ర టీ స్టాళ్లు విజయవంతంగా కొనసాగుతుండడం విశేషం.
ఎస్‌హెచ్‌జీ సభ్యుల్లో ఆనందం
కారేపల్లి మండలంలో ఏర్పాటుచేసిన టీ స్టాళ్లు, నాటు కోళ్ల యూనిట్‌తో వ్యాపారం బాగుండడం, లాభాలు రావటంతో మహిళా సంఘాల సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తొడితలగూడెంలో నాటుకోడి పిల్లల యూనిట్ ఏర్పాటుచేసిన రత్తమ్మ.. 2వేల నాటు కోడిపిల్లలతో పాటు, 20 రోజులకు సరిపడా దాణా మండల సమాఖ్య ద్వారా అందుకుంది. కోడిపిల్లలను సహజసిద్ధమైన వాతావరణంలో పెరగుతుండడంతో డిమాండ్ ఉందని. తద్వారా లాభాలు వస్తున్నాయని ఆమె ఆనందం వ్యక్తం చేసింది.

ఇంతింతై.. ఎదిగేలా...