
ఎస్సీ, ఎస్టీ కేసుల పరిష్కారంపై దృష్టి
ఖమ్మం మయూరిసెంటర్: జిల్లాలో నమోదైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల పరిష్కారంపై అధికా రులు దృష్టి సారించాలని అదనపు కలెక్టర్ పి. శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. కలెక్టరేట్‌లో జరిగిన జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు 735 నమోదు కాగా, 562 కేసుల్లో తీర్పు వెలువడిందని తెలిపారు. అలాగే, కేసుల్లో బాధితులకు రూ. 11.16 కోట్లకు పైగా పరిహారం మంజూరైందని వెల్లడించారు. మిగతా కేసుల విచారణ, పరిష్కారంలో అధికారులు శ్రద్ధ వహించాలని సూచించారు. అనంతరం సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ కేసులను సమీక్షిస్తూ త్వరగా పరిష్కరించాలని తెలిపారు. అలాగే, చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని, బాధితులకు పరి హారం పెంపుపై దృష్టి సారించాలని పేర్కొన్నారు. ఈసమావేశంలో అదనపు డీసీపీ నరేష్‌కుమార్, వివిధశాఖల అధికారులు కె.సత్యనారాయణ, ఎన్. విజయలక్ష్మి, ఏ.శ్రీనివాస్, జి.నర్సింహారావు, ఎల్. రాజేందర్ గౌడ్, రెహమాన్, ఏ.రఘు, తిరుపతిరెడ్డి, కమిటీ సభ్యులు గుంతేటి వీరభద్రయ్య, జె.దాస్ మహరాజ్, తూరుగంటి అంజయ్య, కీసర రాంబాబు, అన్నం శ్రీనివాసరావు, మనికంటి వెంకట్, కలెక్టరేట్ ఉద్యోగి సీహెచ్.స్వామి పాల్గొన్నారు.