
విద్యావ్యవస్థ సమర్థవంతంగా కొనసాగాలి
ఖమ్మంసహకారనగర్: విద్యావ్యవస్థను సమర్థవంతంగా కొనసాగేలా అందరూ కృషి చేయాలని స్టేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ట్రైనింగ్ (సైట్) డైరెక్టర్ విజయలక్ష్మీబాయి సూచించారు. ఖమ్మంలో కొనసాగుతున్న ఉపాధ్యాయుల శిక్షణ కేంద్రాన్ని శనివారం ఆమె పరిశీలించి మాట్లాడారు. ఎంఈఓలు వారి పరిధి పాఠశాలల్లో బోధన నాణ్యత పెంచేలా ప్రణాళిక రూపొందించాలన్నారు. ప్రతీనెల ఉపాధ్యాయుల సమీక్షలు నిర్వహించి, ప్రణాళికపై సూచనలు చేయాలని తెలిపారు. ఆ తర్వాత బడిబాట, పాఠ్యపుస్తకాల సరఫరా, ఏకరూప దుస్తులు సిద్ధం చేయడంపై సూచనలు చేసిన ఆమె శిక్షణలో ప్రతభ కబబర్చిన ఉపాధ్యాయులను సన్మానించారు. జిల్లా విద్యాశాఖ అధికారి సామినేని సత్యనారాయణ, ప్లానింగ్ కోఆర్డినేటర్ రామకృష్ణ, అకడమిక్ మానిటరింగ్ అధికారి రవికుమార్, కమ్యూనిటీ మొబిలైజేషన్ ఆఫీసర్ రాజశేఖర్, ఎంఈఓలు పాల్గొన్నారు. కాగా, పాఠశాలల పునఃప్రారంభం నాటికి ఉపాధ్యాయుల సర్దుబాటు పూర్తి చేయడమే కాక విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, యూనిఫాం సమకూర్చాలని, అన్ని పాఠశాలల్లో తాగునీటి వసతి కల్పించాలని ఎస్‌టీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు దేవరకొండ సైదులు సైట్ డైరెక్టర్ విజయలక్ష్మీబాయికి వినతిపత్రం అందజేశారు. ఎస్‌టీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గండు యాదగిరి, ఎస్‌కే మన్సూర్, నాయకులు పోతగాని వెంకన్న, పాశం శ్రీనివాస్, రామకృష్ణ, రాజు, పెనుగొండ ఉపేందర్‌రావు పాల్గొన్నారు.
సైట్ డైరెక్టర్ విజయలక్ష్మీబాయి