
ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలకు 38 కేంద్రాలు
నేలకొండపల్లి: ఇంటర్‌మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు ఈనెల 22నుంచి జరగనుండగా, జిల్లాలో ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా ఇంటర్ విద్యాశాఖాధికారి కె.రవిబాబు తెలిపారు. నేలకొండపల్లి ప్రభుత్వ జూనియర్ కాలేజీని బుధవారం తనిఖీ చేసిన ఆయన ప్రవేశాల పెంపునకు చేయాల్సిన ప్రచారంపై అధ్యాపకులకు సూచనలు చేశారు. అనంతరం డీఐఈఓ మాట్లాడుతూ సప్లిమెంటరీ పరీక్షలకు 38కేంద్రాలు ఏర్పాటు చేస్తుండగా, 11,780 మంది మొదటి, 3,681 మంది ద్వితీ య సంవత్సరం విద్యార్థులు హాజరుకానున్నారని తెలిపారు. పరీక్షలకు హాజరయ్యే ప్రభుత్వ కాలేజీల విద్యార్థుల కోసం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నామన్నారు. ఈ ఏడాది ప్రభుత్వ కాలేజీల్లో 77.09 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా, వచ్చే ఏడాది నూరు శాతం సాధించేలా కృషి చేస్తామని డీఐఈఓ వెల్లడించారు.
నైపుణ్య శిక్షణకు
దరఖాస్తుల ఆహ్వానం
భద్రాచలంటౌన్: భద్రాచలం ఐటీడీఏ పరిధిలో ని గిరిజన నిరుద్యోగ యువతకు ఐటీసీ ప్రథమ్ ద్వారా నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇవ్వనున్నట్లు ఐటీడీఏ పీఓ బి.రాహుల్ తెలిపారు. కోర్సుల వారీగా పది రోజుల నుంచి 45 రోజులపాటు శిక్షణ ఉంటుందని, బ్యూటీషియన్, అసిస్టెంట్ ఎలక్ట్రీషియన్, టైలరింగ్ శిక్షణ కోసం పదో తరగతి, ఆపై విద్యార్హత కలిగిన వారు అర్హులని పేర్కొన్నారు. పుట్టగొడుగుల పెంపకం శిక్షణకు ఏడో తరగతి, ఆపైన, జ్యూట్ బ్యాగ్‌ల తయారీకి పదో తరగతి ఉత్తీర్ణులైన వారు అర్హులని వెల్లడించారు. భద్రాచలం, ఖమ్మం వైటీసీల్లో శిక్షణ ఇవ్వడమే కాక ఉచిత భోజన, వసతి సౌకర్యం కల్పిస్తామని పీఓ తెలిపారు. ఆసక్తి ఉన్న వారు విద్యార్హత పత్రాలు, కుల ధ్రువీకరణ జిరాక్స్, ఆధార్, రేషన్ కార్డు/ఉపాధి హామీ బుక్, బ్యాంకు పాస్ బుక్, రెండు ఫొటోలతో ఈనెల 21న ఐటీడీఏలోని వైటీసీలో జరిగే ఇంటర్వ్యూకు హాజరుకావాలని సూచించారు. వివరాలకు 63026 08905, 81438 40906 నంబర్లలో సంప్రదించాలని పీఓ తెలిపారు.
ఇరుశాఖల సమన్వయంతో
అభివృద్ధి పనులు
ఖమ్మంవ్యవసాయం: రహదారుల విస్తరణ సమయాన విద్యుత్ స్తంభాలు తొలగించడం, కొత్త స్తంభాలు వేయాల్సి వస్తే రోడ్డు తవ్వడం వంటి పనులతో అభివృద్ధి పనులకు ఫలితం ఉండడం లేదు. ఈ నేపథ్యాన విద్యుత్, రహదారులు, భవనాల శాఖ అధికారులు సంయుక్తంగా కార్యాచరణకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా బుధవారం ఖమ్మం ఎన్పీడీసీఎల్ సర్కిల్ కార్యాలయంలో ఇరు శాఖల అధికారులు సమావేశమయ్యారు. ముదిగొండ నుంచి వల్లభి వరకు రోడ్డు వెడల్పు చేస్తున్న క్రమాన పాత స్తంభాల స్థానంలో కొత్తవి ఏర్పాటు, దానవాయిగూడెం – కామంచికల్ రోడ్డు, బల్లేపల్లి – మంచుకొండ రహదారి, వైరా – మధిర రోడ్లలో చేపట్టాల్సిన పనులు, ఖమ్మం రూరల్ మండలంలోని తరుణి హాట్ వద్ద సబ్‌స్టేషన్ ఏర్పాటుపై చర్చించారు. విద్యుత్ శాఖ ఎస్‌ఈ శ్రీనివాసాచారి, డీఈలు ఎన్.రామారావు, డీఈ నాగేశ్వరరావు, ఆర్ అండ్ బీ ఈఈ యుగంధర్, డీఈలు భగవాన్, వెంకట్రామయ్య, చంద్రశేఖర్ పాల్గొన్నారు.
ఉపాధ్యాయ శిక్షణను పరిశీలించిన ఆర్‌జేడీ
ఖమ్మం సహకారనగర్: ఖమ్మంలో కొనసాగుతున్న ఉపాధ్యాయుల శిక్షణ శిబిరాన్ని పాఠశాల విద్య రీజినల్ జాయింట్ డైరెక్టర్(ఆర్‌జేడీ) సత్యనారాయణరెడ్డి మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఉపాధ్యాయుల హాజ రు, శిక్షణపై ఆరా తీశారు. అనంతరం ఆర్‌జేడీ మాట్లాడుతూ మార్పులకు అనుగుణంగా శిక్షణ లో నేర్చుకున్న అంశాల ద్వారా బోధించాల్సి ఉంటుందని తెలిపారు. డీఈఓ ఎస్.సత్యనారా యణ, ఏఎంఓ రవికుమార్, ప్లానింగ్ కోఆర్డినేటర్ సీహెచ్.రామకృష్ణ, కోర్సు కోఆర్డినేటర్ శైలజలక్ష్మి పాల్గొన్నారు. కాగా, ఖాళీగా ఉన్న గెజిటె డ్ ప్రధానోపాధ్యాయుల పోస్టుల్లో ఎఫ్‌ఏసీ హెచ్‌ఎంలుగా నియమించిన స్కూల్ అసిస్టెంట్లకు ర్యాటిఫికేషన్ ఆర్డర్లు ఇవ్వాలని ఆర్‌జేడీకి పీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షుడు యలమద్ది వెంకటేశ్వర్లు వినతిపత్రం ఇచ్చారు. నాయకులు కట్టా శేఖర్‌రావు, పి.వెంకటేశ్వరరెడ్డి, తాళ్లూరి చంద్రశేఖర్, రత్నకుమార్, డి.రవికుమార్, లింగం సతీష్, టి.వెంకన్న, శాంతారెడ్డి, మహేష్, రవికిరణ్, సుబ్బారావు పాల్గొన్నారు.

ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలకు 38 కేంద్రాలు