
సీబీఎస్‌ఈ ఫలితాల్లో విద్యార్థుల ప్రతిభ
‘హార్వెస్’ విద్యార్థుల విజయకేతనం
ఖమ్మం సహకారనగర్: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్‌ఈ) పదో తరగతి, 12వ తరగతి ఫలితాల్లో తమ విద్యార్థులు అత్యుత్తమ మార్కులు సాధించారని హార్వెస్ట్ విద్యాసంస్థల కరస్పాండెంట్ పి.రవిమారుత్, ప్రిన్సిపాల్ పార్వతిరెడ్డి తెలిపారు. పదో తరగతి పరీక్షలకు 250మంది హాజరుకాగా 100శాతం ఉత్తీర్ణత నమోదైందని వెల్లడించారు. ఇందులో 500మార్కులకు కె.రిషిత్ 492మార్కులతో అగ్రస్థానంలో నిలవగా, ఎస్.తేజస్వి 489, బి.హిమవర్షిణి 487, ఎం.ధన్విత 485, బి.చందనప్రియ 483, ఎస్.కే.షాజియా ఇరం 483, పి.ధీరజ్ 481, బి.సహస్ర, పి.భువన్ 480మార్కులు సాధించారని తెలిపారు. అలాగే, 12వ తరగతి ఫలితాల్లో 500కు ఎన్.రాఘవేంద్ర నవనీత్ 487 మార్కులతో అగ్రస్థానాన నిలిచాడని కరస్పాండెంట్, పార్వతిరెడ్డి తెలిపారు. అంతేకాక రేపల్లి శ్రీష 484, బి.సాయిచరణ్ 482, ఎం.నాగయశ్వంత్ 482, బి.సిద్ధార్థ్ 482, ఎన్.సీ.హెచ్.జస్వంత్ సాయి 478, బి.సంజయ్ 477, జి.రాణి ఉమాఅలేఖ్య 475, డి.శ్రీనివాస గౌతమ్‌రెడ్డి 472, కె.రోహిత 471, టీ.డీ.వీ.ఎస్.ఎస్.నైమాంజలి 470, బి.భార్గవి 470మార్కులు సాధించారన్నారు. కాగా, 12వ తరగతి పరీక్షకు 185 మంది హాజరవగా 100శాతం ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులను కరస్పాండెంట్ రవిమారుత్, ప్రిన్సిపాల్ పార్వతిరెడ్డితో పాటు ఉపాధ్యాయులు అభినందించారు.

సీబీఎస్‌ఈ ఫలితాల్లో విద్యార్థుల ప్రతిభ