
నిప్పుల కుంపటిలా జిల్లా..
ఖమ్మంవ్యవసాయం: జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. సూర్యప్రతాపంతో జనం విలవిల్లాడుతున్నారు. దాదాపు జిల్లా అంతటా 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదవుతుండడంతో మధ్యాహ్నం వేళ రహదారులు బోసిపోతున్నాయి. ఉదయం నుంచే ఎండ ప్రభావం మొదలై మధ్యాహ్నానికి తీవ్రరూపం దాలుస్తుండగా, సాయంత్రం దాటినా వేడి తగ్గడం లేదు. సోమవారం అత్యధికంగా వైరా(ఏఆర్‌ఎస్) వద్ద 42.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, పమ్మిలో 42.8, వైరా, ఉర్నవల్లి, తల్లాడలో 42.6, బాణాపురంలో 42.5, ఖమ్మం ఖానాపురంలో 42.3, ఎర్రు పాలెం, గౌరారం, చింతకానిలో 42.2, పెద్దగోపతి, నేలకొండపల్లిలో 42.1డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కల్లూరు, పెనుబల్లిలో 41.9, గంగారం, కొణిజర్లలో 41.8, పల్లెగూడెంలో 41.6, మధిర 41.4, ఖమ్మం ప్రకాష్‌నగర్, ఏన్కూరు, గుబ్బగుర్తిలో 41.3, బచ్చోడు 41.2, ఖమ్మం ఎన్‌ఎస్‌టీ గెస్ట్‌హౌస్, రఘునాథపాలెంలో 41.1, తిమ్మారావుపేట, కూసుమంచి, మంచుకొండలో 41, వేంసూరులో 40.9, గేటు కారేపల్లి, లింగాలలో 40.7, సత్తుపల్లి, ముదిగొండలలో 40.6, సిరిపురం, సత్తుపల్లి ఓసీల వద్ద 40.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని అధికారులు నివేదిక విడుదల చేశారు. మంగళవారం కూడా ఇదే స్థాయిలో ఉష్ణోగ్రతలు కొనసాగుతాయని తెలిపారు.
వైరాలో 42.9 డిగ్రీల ఉష్ణోగ్రత