
ర్యాంకర్ల భవిష్యత్ ప్రణాళికలు..
ఐఐటీలో చదవాలని ఉంది..
హార్వెస్ట్ కాలేజీలో చదివిన నేను ఎప్‌సెట్‌లో 77వ ర్యాంక్ సాధించాను. ఐఐటీలో బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చదివి సాఫ్ట్‌వేర్ జాబ్ చేయాలని ఉంది. తల్లిదండ్రుల తోడ్పాటుతో పాటు పాఠశాల యాజమాన్యం సలహాలు, ప్రత్యేక శిక్షణతో ఈ విజయం సాధించగలిగాను. నాన్న అనిల్‌కుమార్ కిరాణ షాపు వ్యాపారి, తల్లి కల్యాణి గ్రహణిగా ఉన్నారు.
– సాయిచరణ్, హార్వెస్ట్ విద్యార్థి
సాఫ్ట్‌వేర్ కంపెనీ నెలకొల్పాలని..
ఎప్‌సెట్ ఫలితాల్లో నా తల్లిదండ్రులు, కళాశాల యాజమాన్యం ప్రోత్సాహంతోనే రాష్ట్రస్థాయిలో 28వ ర్యాంక్ సాధించగలిగాను. ఇంజనీరింగ్‌లో కంప్యూటర్ సైన్స్ చదివి సాఫ్ట్‌వేర్ కంపెనీ నెలకొల్పాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నాను. మాది వైరా. నాన్న మల్లిఖార్జున్‌రావు వస్త్ర వ్యాపారం చేస్తుండగా.. అమ్మ గృహిణిగా ఉన్నారు.
– వి.కుషాల్, శ్రీచైతన్య విద్యార్థిని

ర్యాంకర్ల భవిష్యత్ ప్రణాళికలు..