
సంపద పేదలకు పంచితే అన్యాయమా?
మూడు రోజుల్లో మస్తానికుంటకు నీరు
జిల్లా పెద్దాస్పత్రిపై ‘రెడ్‌బ్యాండ్’
ఖమ్మంవైద్యవిభాగం: భారత్ – పాకిస్తాన్ సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితుల నేపథ్యాన ప్రభుత్వం అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల భవనాల టాప్‌పై రెడ్‌బ్యాండ్ గుర్తు వేయిస్తోంది. ఇందులో భాగంగానే ఖమ్మం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి స్లాబ్‌పైనా పెద్దసైజ్‌లో తెలుపు రంగు, ఆపై ఎరుపు రంగుతో క్రాస్ గుర్తు వేయించారు. ఈ గుర్తు వేయించడం ద్వారా యుద్ధ సమయాన విమానాలు, హెలికాప్టర్ల నుండి చూసినా కనిపిస్తుందని, ఈ గుర్తు ఉన్నవి ఆస్పత్రులుగా గుర్తించి శత్రుదేశాలు జెనీవా ఒప్పందం ప్రకారం దాడి చేయవని అధికారులు తెలిపారు.
రఘునాథపాలెం: మండలంలోని సాగర్ ప్రధాన కాల్వపై నిర్మించిన మంచుకొండ ఎత్తిపోతల పథకం ద్వారా మూడు రోజుల్లో మసానికుంటకు నీరు విడుదల చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. రఘునాథపాలెం మండలం గడ్డికుంట తండా వద్ద గ్రావిటీ–5 కాల్వ, బావోజీతండా వద్ద ఉన్న రేగులకుంట చెరువును శనివారం ఆయన పరిశీలించి మాట్లాడారు. మంచుకొండ ఎత్తిపోతల పథకం ట్రయల్ రన్‌లో భాగంగా చెరువులకు నీరు విడుదల చేస్తున్నామని తెలిపారు. తద్వారా రేగులకుంట చెరువు నిండి అలుగు పారుతూ నల్లకుంట చెరువు, మల్లెపల్లికి చేరుతోందని చెప్పారు. మస్తానీకుంట, మంచుకొండకు కూడా మూడు రోజుల్లో నీరు చేరేలా అధికారులు పర్యవేక్షించాలని సూచించారు. రూ.66.33 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ ఎత్తిపోతల పథకం ద్వారా సుమారు 2,400 ఎకరాల ఆయకట్టుకు సాగర్ జలాలు అందుతాయని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి పుల్లయ్య, ఆర్డీఓ జి.నర్సింహారావు, ఇరిగేషన్ ఈఈ అనన్య, డీఈ ఝాన్సీ, ఏడీఏ వెంకటేశ్వరరావు, సొసైటీ అధ్యక్షుడు తాతా రఘురాం, ఆత్మ చైర్మన్ దిరిశాల చిన్న వెంకటేశ్వర్లుతో పాటు మానుకొండ రాధాకిషోర్, వాంకుడోత్ దీపక్, దేవ్‌సింగ్, నగేష్, రామ్మూర్తినాయక్, తదితరులు పాల్గొన్నారు. కాగా, అలుగుబారుతున్న రేగులకుంట చెరువు వద్ద మంత్రి పూజలు చేశారు.
ఎత్తిపోతల పథకాన్ని పరిశీలించిన మంత్రి

సంపద పేదలకు పంచితే అన్యాయమా?

సంపద పేదలకు పంచితే అన్యాయమా?

సంపద పేదలకు పంచితే అన్యాయమా?