
●అమ్మ లాంటి దేశరక్షణలో..
తిరుమలాయపాలెం: మండలంలోని రమణతండాకు చెందిన రమావత్ రామచంద్రు – రాజమ్మ కుమారుడైన మూర్తిలాల్ పదిహేనేళ్లుగా భారత సైన్యంలో విధులు నిర్వర్తిస్తున్నాడు. సైన్యంలో చేరేటప్పుడు తల్లిదండ్రులు ఆందోళనకు గురైనా తల్లి లాంటి దేశ రక్షణ విధులకు వెళ్తున్నానని చెప్పడంతో అంగీకరించారు. ఈ సందర్భంగా రాజమ్మ మాట్లాడుతూ తన కుమారుడు తరచుగా ఫోన్ చేసి మాట్లాడతాడని తెలిపింది. ప్రస్తుతం విశాఖపట్నంలో విధులు నిర్వర్తిస్తున్నా యుద్ధం నేపథ్యాన ఎక్కడికైనా వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలనే సమాచారం వచ్చిందని చెప్పాడని పేర్కొన్నారు.