
●అటు భయం.. ఇటు గర్వం
సూపర్‌బజార్(కొత్తగూడెం): కొత్తగూడెంలోని రామవరానికి చెందిన దాచేపల్లి ఖాదర్‌రాజు –యజ్ఞకుమారి కుమారుడైన ఉదయ్‌కుమార్ జమ్మూలో మేజర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. జవాన్‌గా చేరి మేజర్ స్థాయికి ఎదిగారు. ఆయన భార్య లక్ష్మీసత్య, ఏడాది కుమార్తె కూడా జమ్మూలోనే ఉండగా, వారి నివాసాని కి సమీపంలో బాంబులు పడ్డాయని సమాచారం ఇచ్చారు. ఉదయ్ తల్లి యజ్ఞకుమారి మాట్లాడుతూ ఇప్పుడు భయంగా ఉన్నా.. దేశ రక్షణలో కుమారుడు భాగస్వామ్యమైనందుకు గర్వంగా ఉందని తెలిపారు. దేశం కోసం దేనికై నా సిద్ధమేనని చెబుతాడని వెల్లడించారు.