
ఆపరేషన్ సిందూర్‌కు కేఎంసీ మద్దతు
దేశ రక్షణనిధికి విరాళంగా నెల వేతనం
ఖమ్మంమయూరిసెంటర్: భారత ఆర్మీ తలపెట్టిన ఆపరేషన్ సిందూర్‌కు ఖమ్మం కార్పొరేషన్ పాలకవర్గం మద్దతు ప్రకటించింది. ఈ సందర్భంగా మేయర్ పునుకొల్లు నీరజ ఆధ్వర్యాన కార్పొరేటర్లు, అధికారులు, ఉద్యోగులు శనివారం ప్రదర్శన నిర్వహించారు. కేఎంసీ కార్యాలయం నుండి ఆర్టీఓ ఆఫీస్ సిగ్నల్ వరకు ప్రదర్శనగా వెళ్లి మానవహారంగా ఏర్పడి సైన్యానికి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ దేశ సరిహద్దుల్లో పాక్ దాడులను భారత సైనం తిప్పికొడుతూ ప్రజల రక్షణకు పాటుపడుతున్నందున ప్రతిఒక్కరు సంఘీభావం తెలపాలని కోరారు. కాగా, దేశ రక్షణనిధికి తనతో పాటు కార్పొరేటర్ల నెల వేతనం రూ.4లక్షల మేర విరాళంగా ఇస్తున్నట్లు తెలిపారు. డిప్యూటీ మేయర్ ఫాతిమ జోహరా, కార్పొరేటర్లు కర్నాటి కృష్ణ, బీ.జీ.క్లెమెంట్, రాపర్తి శరత్, దండ జ్యోతిరెడ్డి, గజ్జల లక్ష్మీవెంకన్న తదితరులు పాల్గొన్నారు.